ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె మళ్లి బహిరంగంగా కనిపించింది. ఈసారి క్షిపణి శాస్త్రవేత్తల బృందంతో కనిపించింది. తండ్రికి అత్యంత బిడ్డగా పేర్కొనబడింది. ఆమె వయస్సు 10 ఏళ్ల మాత్రమే. కానీ, ఆమెను ప్రపంచానికి పరిచయం చేయడం వెనుక కిమ్ వ్యూహం ఏమిటన్నది చర్చకు దారితీసింది. బహుశా ఆమెను వారసురాలిగా ప్రకటిస్తారా? అనే ప్రచారం జరుగుతోంది. జు ఏ అనే పేరు గల ఈమె, కిమ్‌కి రెండవ సంతానం. గత వారాంతంలో ఆమె తన తల్లిదండ్రులుతో ఉత్తర ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని వీక్షించేందుకు బయటకు వచ్చింది.
తొలిసారి ప్రపంచానికి పరిచయం అయింది. తండ్రి చేయి పట్టుకుని నడుస్తూ దర్శనమిచ్చింది. ఈసారి శాస్త్రవేత్తలతో గ్రూపు ఫొటోకు ఫోజిచ్చింది. ఆదివారం ఫోటోలలో ఆమె చాలా పరిణతి చెందిన రూపాన్ని కలిగి ఉంది. కొన్ని ఫోటోలు ఈ జంట ముందు యూనిఫాం ధరించిన సైనికుల మధ్య నిలబడి ఉన్నట్లు చూపించాయి. లాంచ్ ట్రక్ పైన భారీ క్షిపణి ఉంది. దక్షిణ కొరియా మీడియా గతంలో కిమ్‌కు ముగ్గురు పిల్లలున్నట్లు పేర్కొంది. 2010, 2013, 2017లో జన్మించారని తెలిపింది. మొదటి సంతానం ఒక కొడుకు కాగా, మూడవ సంతానం కుమార్తెగా పేర్కొంది.