Tuesday, November 26, 2024

నాటోను రష్యా నడిపిస్తోందా? పశ్చిమదేశాల వైఖరిపై జెలెన్‌స్కీ మండిపాటు..

మాస్కో బెదిరింపు కారణంగా నాటో నాయకులు తమకు ఆయుధ సరఫరాలను నిలిపివేస్తున్నారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. నాటోను రష్యా నడిపిస్తోందా అని ప్రశ్నించారు. రష్యా దళాలను ఎదుర్కొనేందుకు మరిన్ని ట్యాంకులు, విమానాలు, క్షిపణులను ఇవ్వాలని పశ్చిమ దేశాలను వేడుకున్నాడు. ఈ మేరకు జెలెన్‌స్కీ శనివారం రాత్రి ఓ వీడియో విడుదల చేశారు. ఐరోపాలో స్వేచ్ఛను కాపాడగల భారీ ఆయుధాలు గోదాముల నిల్వల్లో దుమ్ములో పేరుకుపోయాయని జెలెన్‌స్కీ తీవ్రంగా విమర్శించారు. రష్యన్‌ విమానాలను మెషిన్‌ గన్‌లతో పేల్చివేయలేమన్నారు.’నాటో ఏం చేస్తోంది..? దానిని రష్యా నడుపుతోందా..?31 రోజులు గడిచాయి.. వారు దేని కోసం ఎదురు చూస్తున్నారు..? నాటో వద్ద ఉన్న దానిలో మేం 1 శాతం మాత్రమే అడుగుతున్నాం. ఇంకేమీ లేదు’ అని జెలెన్‌స్కీ భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. నాటో నాయకులు ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు యాంటీ ట్యాంక్‌, యాంటీ క్రాప్ట్ క్షిపణులతో పాటు చిన్న ఆయుధాలు, రక్షణ పరికరాలను అందించారు. కానీ భారీ కవచాలు లేదా విమానాలను అందించలేదన్నారు.

మాకు మరింత మందుగుండు సామగ్రి కావాలి. మేము ఇప్పటికే 31 రోజులు వేచి చూశాం. నాటో ఏం చేస్తోంది? యూరో-అట్లాంటిక్‌ కమ్యూనిటీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? బెదిరింపులతో రష్యానే నాటోను నడిపిస్తోందా? అని నిలదీశారు. ప్రతినిత్యం ఫిరంగి బారేజీలు, వైమానిక బాంబు దాడులు మా నగరాలను శిథిలావస్థకు చేర్చుతున్నాయి. పౌరులను చంపడం, ఇతరులను అజ్ఞాతంలోకి నెట్టివేయడం వల్ల రష్యాపై ఉక్రెయిన్‌ ప్రజలలో తీవ్ర ద్వేషాన్ని రగుల్చుతున్నారని మాస్కోను హెచ్చరించారు. ”మీరు మా ప్రజలు రష్యన్‌ భాషను విడిచిపెట్టేలా చేస్తున్నారు. మీ పేలుళ్లు, హత్యలు, మీ నేరాలతో ఇప్పుడు రష్యన్‌ భాష మారుతోంది అని జెలెన్స్కీ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement