ఆటవిక సమాజం నుండి ఆధునిక సమాజం వరకు స్త్రీలు పోషించిన.. పోషిస్తున్నపాత్ర అత్యుత్తమమైనది. నేటి సమాజంలో స్త్రీల చాకిరి రెట్టింపైయింది. స్త్రీలు ఆనాడు చదువుకోసం అనేక పోరాటాలు చేయవలసి వచ్చింది. నాటి పోరాటాల
ఫలితంగా నేడు స్త్రీలు చదువుకుంటున్నా
రు. లక్ష లాది రూపాయలు సంపాదిస్తున్నారు.అయినా.. స్త్రీలపై అనేక రకాల హింసలు కొనసాగుతూనే ఉన్నాయి. గృహిణిగా ఆమె చేస్తున్న శ్రమకు
విలువ లేకుండా పోతున్నది. ఆర్ధిక సూచీలను గణించేటప్పుడు గృహిణి శ్రమను పరిగణనలోకి
తీసుకోవడం లేదు. ఒకవేళ తీసుకున్నా… అవన్నీ
ఆరకొర లెక్కలే… నిజానికి గృహిణి శ్రమను ఆర్థిక
సూచీలోకి తీసుకుంటే మన దేశ జీడీపీ భారీ స్థాయిలో పెరుగుతుంది. అయినా… గృహిణి శ్రమను డబ్బు పరంగా లెక్కించడం అంత ఈజీ కూడా
కాదు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేవరకు స్త్రీలు వ్యవసాయం, వంట చేయడం, పిల్లలను పోషించడం, ఇంటిపని, బట్టలపని, పశువుల
పని ఇలా ఇంటా బయటా పనులతో తలమునకలై
ఉంటారు. ఇంటి పని, వంట పని స్త్రీలే చేయాలన్నచిన్న చూపు నేటి పితృస్వామిక సమాజంలో బలంగా వేళ్లూనుకున్నది.
ఒకప్పుడు సంతానోత్పత్తియే మొత్తం సామాజికఉత్పత్తిగా పరిగణించేవారు. ఆ తరువాత స్త్రీలు అనేక వృత్తులను చేపట్టారు. ఇల్లు కట్టడం, వ్యవ
సాయం చేయడం లాంటి అనేక పనులలో పాలు పంచుకోవడం ప్రారంభించారు. ఏమైనా.. సంతానోత్పత్తి లేకుంటే నేడు మొత్తం మానవ సమాజం
ఆగిపోతుంది.
సంతానోత్పత్తికి చాలా బలమైన అర్థిక విలువ ఉంది. స్త్రీ లేకపోతేజననం లేదు, గమనం లేదు, సృష్టిలో జీవంలేదు. అసలు సృష్టియేలేదు. అదేవిధంగా…మహిళలకు సాధికారత కల్పించడం రాజకీయ పార్టీలకు ఇష్టం లేదు. మహిళల ఓట్లు ప్రతి రాజకీయ పార్టీకి కావాలి కానీ వారికి రిజర్వేషన్లు ఇవ్వడానికి ముందుకు రావడంలేదు. మహిళా బిల్లు 1990 నుండి పెండింగ్ లో ఉన్నది. చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్ల కల్పించడం కోసం ఉద్దేశించిన ఈ బిల్లుకు మోక్షం ఎప్పుడో ఏ పార్టీ నాయకుడూ చెప్పలేకపోతున్నాడు. 1994 సంవత్సరంలో మొదటిసారి బీజేపీ పార్టీ ఈ బిల్లును తెచ్చింది. ఆ తరువాత 1996లో దేవెగౌడ, 1998, 1999లో వాజ్ పేయి ప్రభుత్వ సమయంలో చర్చకు వచ్చినప్పటికి, రాంవిలాస్ పాశ్వాన్, లాలూ ప్రసాద్ యాదవ్, శరత్ యాదన్లుతీవ్రంగా వ్యతిరేకించారు.
అయితే అప్పుడు బీజేపీకిపూర్తి మద్దతు లేదనే కారణంగా బిల్లు ఉపసంహరించుకుంది. 2004 సంవత్సరంలో కాంగ్రెస్
ప్రభుత్వం వచ్చినా… ఈ బిల్లు ఊసేలేదు. 2010లో
సోనియాగాంధీ రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేసారు, కానిలోకసభలో మాత్రం ఆమోదం పొందలేదు. దీనితో అమలుకు ఆమడదూరంలో నిలిచిపోయింది. కానీ రాష్ట్ర శాసన సభ, పార్లమెం
ట్ వంటి నిర్ణయాలు తీసుకునే చట్ట సభలలో మాత్రం స్త్రీలకు రిజర్వేషన్లు కల్పించడానికి అన్నీ రాజకీయ పార్టీలు అడ్డుపడుతున్నాయి. మహిళా సాధికారత అంటే కేవలం చట్టాలు చేస్తే సరిపోదు. ఆ చట్టాలను ప్రభుత్వాలు సక్రమంగా అమలుచేయాలి. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టి ఉభయసభలలో ఆమోదింపజేసి ప్రభుత్వాలు తమ చిత శుద్ధిని చాటుకోవాలి. సమాజంలో మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విషయాలలో స్వయంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే మహిళా సాధికారత సాధించినట్లు. ఆ దిశగా ప్రభుత్వాలు ముందడుగువేయాలి.