దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్‌లో.. భారత జట్టు తమ ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఐర్లాండ్‌తో ఇవ్వాల (గురువారం) జరిగిన మ్యాచ్‌లో 201 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా ఐర్లాండ్ ముందు 302 పరుగుల భారీ టార్గెట్‌ను సెట్ చేసింది. కాగా చేజింగ్‌కు దిగిన ఐర్లాండ్ 100 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఇండియన్ బ్యాటర్లలో ముషీర్ ఖాన్ (106 బంతుల్లో 118, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో హోరెత్తించాడు. కెప్టెన్ ఉదయ్ సహరన్ (84 బంతుల్లో 75, 5 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక అర్షిన్ కులకర్ణి (32) ఫర్వాలేదనిపించాడు. మెత్తంగా భారత్ జట్టు 7 వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది.
ఇక చేజింగ్ కు దిగిన ఐర్లాండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.. భారత బౌలర్లలో నమన్ తివారీ అత్యధికంగా 4 వికెట్లు తీయగా., సౌమీ పాండే 3 వికెట్లతో మెరిసాడు. ఇక ధనుష్ గౌడ, మురుగన్ అభిషేక్, ఉదయ్ సహారన్ లు చరో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో భారత జట్టు గ్రూప్ స్టేజ్‌లోని పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇక రెండు, మూడు స్థానాల్లో బంగ్లా, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి.