Saturday, November 23, 2024

ప్రయానికులకు ఐఆర్‌సీటీసీ వార్నింగ్.. ఆ యాప్ వాడద్దు అంటూ హెచ్చరిక

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ రైల్వే (IRCTC) ప్రయాణికులకు హెచ్చరిక జారీ చేసింది. “irctcconnect.apk” పేరుతో ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ చక్కర్లు కొడుతోందని, ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయకూడదని ఐఆర్‌సీటీసీ హెచ్చరిస్తోంది. ఈ డేంజరస్ యాప్ వాట్సప్, టెలిగ్రామ్ లాంటి ఛాట్ యాప్స్‌లో చక్కర్లు కొడుతున్నట్టు తేలింది. ఈ ఏపీకే ఫైల్ ద్వారా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే చిక్కుల్లో పడక తప్పదని.. మీ మొబైల్ ఫొన్ కి హాని కలిగించవచ్చని ఐఆర్‌సీటీసీ హెచ్చరిస్తోంది.

- Advertisement -

అలాగే, ఐఆర్‌సీటీసీకి సంబంధించి వచ్చే మెయిల్స్‌కు రిప్లై ఇచ్చేప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. సైబర్ నేరగాళ్లు ఐఆర్‌సీటీసీ నుంచి మెయిల్స్ పంపుతున్నట్టు నమ్మించి మోసం చేస్తున్నారని, కస్టమర్ల యూపీఐ, బ్యాంక్ ఖాతా లాంటి వివరాలు దొంగిలిస్తున్నారని ఐఆర్‌సీటీసీ గుర్తించింది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి యాప్స్‌ను నమ్మొద్దని, జాగ్రత్తగా ఉండాలని ఐఆర్‌సీటీసీ వార్నింగ్ ఇస్తోంది.

ఆండ్రాయిడ్ యూజర్లు ఐఆర్‌సీటీసీ అధికారిక యాప్ డౌన్‌లోడ్ చేయాలంటే గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేయాలి. అందులో IRCTC అని సెర్చ్ చేస్తే ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ కనిపిస్తుంది. డెవలపర్ దగ్గర IRCTC Official అని కనిపిస్తుంది. కేవలం ఆ యాప్ మాత్రమే డౌన్‌లోడ్ చేయాలి. లేదా https://www.irctc.co.in/ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి రైలు టికెట్స్ బుక్ చేయాలి అని ఐఆర్‌సీటీసీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement