Saturday, November 23, 2024

రైలు ఆలస్యంగా నడిచినందుకు ప్రయాణికులకు రూ.4.5 లక్షల పరిహారం

సాధారణంగా భారతీయ రైళ్లు ఆలస్యం అవుతాయనే నానుడి ఉంది. అందుకే నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అని సెటైర్ వేస్తుంటారు. కానీ రైలు ఆలస్యంగా నడిస్తే ప్రయాణికులకు పరిహారం చెల్లించడం మీరు ఎప్పుడైనా విన్నారా? మన దేశంలో తొలిసారిగా ఓ రైలు ఆల‌స్య‌మైతే ప‌రిహారం చెల్లించే నిబంధ‌న తేజ‌స్ ఎక్స్‌ప్రెస్ విష‌యంలో ఉంది. ఇటీవల శనివారం నాడు ఢిల్లీలో భారీ వర్షం కురవడంతో తేజస్ రైలు రెండున్నర గంటలు ఆలస్యంగా నడిచింది.

నిబంధనల ప్రకారం ఈ రైలు గంట ఆల‌స్య‌మైతే రూ.100, రెండు గంట‌లు, అంత‌కంటే ఎక్కువైతే రూ.250 ప‌రిహారం ఒక్కో ప్ర‌యాణికుడికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు శ‌నివారం తేజ‌స్ ఎక్స్‌ప్రెస్ ఆల‌స్య‌మైనందుకు అందులోని 1574 మంది ప్ర‌యాణికుల‌కు ఒక్కొక్క‌రికి రూ.250 చొప్పున మొత్తం రూ.3.93 ల‌క్ష‌లు, ఆదివారం ఆల‌స్య‌మైనందుకు అందులోని 561 మంది ప్ర‌యాణికులు ఒక్కొక్క‌రికి రూ.150 చొప్పున ఈ రైలును ఆప‌రేట్ చేస్తున్న ఐఆర్‌సీటీసీ చెల్లిస్తుంది.

కాగా దేశంలో తొలి తేజ‌స్ ఎక్స్‌ప్రెస్ 2019, ఆగ‌స్ట్ 4న ల‌క్నో నుంచి ఢిల్లీ వెళ్లింది. ఈ రెండేళ్ల కాలంలో గంటలోపు రైలు ఆల‌స్య‌మైన సంద‌ర్భాలు ఐదుసార్లు మాత్ర‌మే ఉన్నాయి. 99.9 శాతం ఈ రైలు ఆల‌స్యం కాద‌ని ఐఆర్‌సీటీసీ చెబుతోంది. గ‌త రెండేళ్ల‌లో ఐఆర్‌సీటీసీ ఇంత భారీ మొత్తంలో ప‌రిహారం చెల్లించాల్సి రావ‌డం ఇదే తొలిసారి. గ‌త ఏడాది చలికాలంలో మంచు కారణంగా ఇలాగే రైలు రెండు గంట‌ల ఆల‌స్యం కాగా.. అందులోని 1500 మంది ప్ర‌యాణికులు ప‌రిహారం చెల్లించారు.

ఈ వార్త కూడా చదవండి: శ్రావణమాసంలో భర్త చికెన్ తిన్నాడని భార్య ఆత్మహత్య

Advertisement

తాజా వార్తలు

Advertisement