ఇరాక్ దేశంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర ఇరాక్‌లోని అల్-హమ్దానియా పట్టణంలోని ఒక ఈవెంట్ హాల్‌లో వివాహ సమయంలో మంటలు చెలరేగడంతో 100 మంది మరణించారు. ఈ అగ్నిప్రమాదంలో మరో 150 మందికి పైగా గాయపడినట్లు ఇరాక్ వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెప్పారుఈ అగ్నిప్రమాదంలో మరో 150 మందికి పైగా గాయపడినట్లు ఇరాక్ వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు ఇరాక్‌లోని అల్-హమ్దానియాలోని ఈవెంట్ హాలులో వివాహ వేడుక జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 100మంది సజీవ దహనమయ్యారు ఇరాక్‌లోని అల్-హమ్దానియాలోని ఈవెంట్ హాలులో వివాహ వేడుక జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 100మంది సజీవ దహనమయ్యారు.
ఎగసిపడిన అగ్ని కీలలకు గాయపడిన 150 మందిని హమ్దానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు వివాహ వేడుక జరుగుతున్న పెద్ద ఈవెంట్ హాల్‌లో మంటలు చెలరేగడానికి ఈ వేడుకలో ఉపయోగించిన బాణాసంచా కారణమని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని ఇరాక్ పౌర రక్షణ విభాగం తెలిపింది
ఎగసిపడిన మంటల్లో ఈవెంట్ హాలు కాలిపోయింది. ఇరాక్ సెమీ అటానమస్ కుర్దిస్తాన్ ప్రాంతంలోని ఫెడరల్ ఇరాకీ అధికారులు అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందిని సంఘటన స్థలానికి పంపించారు. ఈ ఘోర అగ్నిప్రమాదంతో పెళ్లి వేడుకలో విషాదం అలముకుంది. సంఘటన స్థలంలో ఎటు చూసినా సజీవ దహనమైన మృతదేహాలు కనిపించాయి. గాయపడిని వారిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కాపాడి వారిని అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు