Thursday, November 21, 2024

ఇరానీకప్‌ విజేత రెెస్ట్‌ ఆఫ్‌ ఇండియా.. 238 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్‌ ఓటమి

ఇరానీ కప్‌ లో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా 238 పరుగుల తేడాతో మధ్య ప్రదేశ్‌ను ఓడించి, విజేతగా నిలిచింది. గత రంజీ చాంపియన్‌ ‘రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా’ ఈ కప్‌ను గెలుచుకుంది. అప్పట్లో సౌరాష్ట్రను ఓడించింది. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అభిమన్యు ఈశ్వరన్‌(154), యశస్వి జైస్వాల్‌ (213) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడారు. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 484 పరుగులు చేసింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌కు చెందిన యష్‌ దూబే (109) సెంచరీ చేయడంతో ఫాలోఆన్‌ను తప్పించుకుంది. మధ్య ప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేసింది. ఈ విధంగా
తొలి ఇన్నింగ్స్‌ ఆధారంగా రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా కు 190 పరుగుల ఆధిక్యం లభించింది.

- Advertisement -

ఇక రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (144) సెంచరీ చేసి జట్టును 246 పరుగులకు చేర్చాడు. దీంతో మధ్యప్రదేశ్‌కు 437 పరుగుల విజయ లక్ష్యం లభించింది. ఇక్కడ మధ్యప్రదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో , హిమాన్షు మంత్రి (51), హర్ష గావ్లీ (48) కొంత సేపు పోరాడారు. అయితే మ్యాచ్‌ చివరి రోజు మొత్తం మధ్య ప్రదేశ్‌ జట్టు 198 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఈ విధంగా రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా జట్టు 238 పరుగుల తేడాతో మధ్య ప్రదేశ్‌ను ఓడించి ఇరానీకప్‌ను గెలుచుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement