Friday, November 22, 2024

కరోనా వల్ల పెరిగిన ఒంటరితనం

ఏడాది నుంచి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా వైరస్ ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థిక పరంగా, సామాజిక పరంగా దెబ్బతీస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మనుషులపై కరోనా ప్రభావం ఎంత ఉందనే అంశంపై ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఇప్సోస్‌ ఇండియా చేసిన ఓ స‌ర్వే ఫ‌లితంగా తాజాగా మ‌రో కొత్త విష‌యం వెల్లడైంది. దేశంలో నగరాల్లో నివసించే 45 శాతం మంది క‌రోనా వ‌ల్ల‌ ఒంటరితనాన్ని అనుభవించారని తేలింది. 28 శాతం మంది పట్టణ ప్రజలు కుంగుబాటుకు గురయ్యారని.. దేశంలో ప్ర‌జ‌లు సాధార‌ణంగా త‌మ ప‌క్కింటి వారితో, కార్యాల‌యాల్లో ఉద్యోగులతో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటార‌ని స్పష్టమైంది.

అయితే.. లాక్‌డౌన్ కార‌ణంగా వారు కొత్తరకం ఒంటరితనాన్ని అనుభ‌వించార‌ని స‌ర్వేలో తేలింది. వారంతా బలవంతంగా ఏకాంత సమయాన్ని గ‌డ‌పాల్సి వ‌చ్చింది. దాని నుంచి బ‌య‌టప‌డ‌డానికి ఇంటర్‌నెట్‌ను తెగ వాడేశారు. ఆన్‌లైన్‌లోనే బంధువులతో మాట్లాడుకోవడంతో పాటు స్నేహితుల‌తో గేమ్స్‌ ఆడుకోవడం వంటివి చేశారు. సోషల్ మీడియా, ఓటీటీకి ప్ర‌జ‌లు బాగా అల‌వాటు ప‌డ్డారు. కొంత మంది ఇంట్లోనే కుటుంబ సభ్యులతో గ‌డిపారు. కాగా కరోనా సంక్షోభంలో తమ కాలనీల్లో పొరుగున ఉండే వ్యక్తుల నుంచి త‌మ‌కు అన్ని రకాలుగా మద్దతు లభించిందని 50 శాతం మంది పట్టణ ప్రజలు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement