రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఐపీఎస్ మాజీ అధికారి వికెసింగ్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కుటుంబపాలనసాగుతుందని, అవినీతిలో తెలంగాణ దేశంలో రెండవ స్థానంలో ఉందన్నారు. బంగారు తెలంగాణలో మంచి పోలీసు అధికారులకు విలువ లేదని మండిపడ్డారు. పని చేసే సీని యర్లకు స్థానంలేదని, రిటైర్డ్ అయిన వారికి మంచి పదవులను కట్టబెడు తున్నా రని, చాలా మంది సీనియర్లు పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నా పట్టించు కోవ డం లేదని వాపోయారు.
సేవ చేయాలన్న సంకల్పంతోనే పోలీసు శాఖలోకి వచ్చా నని, రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో గురువారం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన వీకే సింగ్ రాష్ట్ర పోలీసు శాఖలోని
వివిధ స్థాయిలలో పని చేసి గత ఏడాది మే మాసంలో పదవీ విరమణ పొందారు.