చత్తీస్ఘడ్ లో ఓ ఐపీఎస్ ఆఫీసర్ పై దేశద్రోహం కేసు నమోదైంది. రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు ఐపీఎస్ జీపీ సింగ్ ప్రయత్నించాడని, ప్రజానేతలు, ప్రభుత్వం పట్ల కుట్ర పన్నినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే తొలత అక్రమాస్తుల కేసులో ఐపీఎస్ ఆఫీసర్ గత వారమే సస్పెషన్కు గురయ్యాడు. ఏసీబీ, ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ చేసిన దాడుల్లో.. జీపీ సింగ్ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు తేలింది. సోదాలు నిర్వహిస్తున్న సమయంలో దొరికిన కొన్ని కాగితాల ఆధారంగా అతనిపై దేశద్రోహం కేసు బుక్ చేశారు.
ఇది కూడా చదవండి: ఎంపీడీఓపై ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యల… లైంగిక వేధింపుల కేసు పెట్టాలని డిమాండ్