Friday, November 22, 2024

నేటి నుంచి ఐపీఎల్‌- సీజ‌న్ 16 ప్రారంభం..

ముంబై: క్రికెట్‌ అభిమానులను వేసవి వినోదంలో ముంచెత్తే ఐపీఎల్‌-2023 సీజన్ నేడు మొదలవుతోంది. పొట్టి క్రికెట్‌ మెగా పండగ ఆరంభం కానుంది. తమ అభిమాన జట్లలో టైటిల్‌ ఫేవరెట్‌ ఎవరనే దగ్గర్నుంచి, ఏ జట్టు ఎక్కువ మ్యాచ్‌లు గెలుస్తుంది? ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారు? టాప్‌ వికెట్‌ టేకర్‌ ఎవరవుతారు? క్యాచ్‌లు.. సిక్సర్లు.. కళ్లు చెదిరే క్యాచ్‌లు ఇలా.. బంతిబంతికి ఉత్కం ఠను రేకెత్తించే ఐపీఎల్‌ సంబరం గురించి అభిమానుల్లో చర్చ జోరం దుకుంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 16వ సీజన్‌ మునుపటి కంటే కాస్తంత విభిన్నంగా జరగనుంది. క్రికెట్‌ ద్వారా మరింత మజాను అందించేలా సిద్ధమైంది. థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లు వీక్షించేందుకు అభిమానులు ఆతృతగాఉన్నారు. ఆయా ఫ్రాంచైజీలు కూడా కొత్త సీజ న్‌పై కొత్త ఆశలతో మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాయి. ఐపీ ఎల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బీసీసీఐ కొత్తగా అమ లు చేయబోతున్న వినూత్న నిబంధనలు సైతం ఆసక్తిని రేకెత్తిస్తున్నా యి. టాస్‌ తర్వాత కూడా జట్లను ప్రకటించే వెసులుబాటుతోపాటు, వైడ్‌, నో బాల్స్‌పైనా రివ్యూ కోరే అవకాశం, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన ఈసీజన్‌కు కొత్తదనం తేనున్నా యి. బౌలర్‌ బంతివేసేట ప్పుడు కీపర్‌ లేదా ఫీల్డర్‌ దురుద్దేశ పూర్వకంగా కదిలితే ఫీల్డింగ్‌ జట్టు కు ఐదు పరు గులు పెనాల్టిdగా లభిస్తా యి. పైగా ఆ బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటి స్తారు. ఇక నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తిచేయకుంటే, సర్కిల్‌బయట ఐదుగురు ఫీల్డర్లకు బదులు, నలుగురినే అనుమతిస్తారు. ఇలా ఈసారి ఐపీఎల్‌ రసవత్తరంగా ఉండబోతున్నది.


లీగ్‌లో.. 10 జట్లు.. 70 మ్యాచ్‌లు..
ఈ సీజన్‌లో పాల్గొనే మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభ జించారు. అయితే మునుపటికి భిన్నంగా ప్రత్యర్థి మ్యాచ్‌లను షెడ్యూ ల్‌ చేశారు. ఒక్కో గ్రూప్‌లోని ప్రతిజట్టు అవతలి గ్రూప్‌లోని జట్టుతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. అలాగే, తన గ్రూప్‌లోని మిగ తా నాలు గు జట్లతో ఒక్కొక్క మ్యాచ్‌ ఆడాల్సిఉంటుంది. ఇలా మొత్తం గా లీగ్‌ దశలో ప్రతిజట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇలా లీగ్‌దశలో 70 మ్యా చ్‌లు జరుగుతాయి. ఈసీజన్‌లో జరిగే మ్యాచ్‌లకు 12 వేదికలు ఆతిథ్యం ఇస్తున్నాయి. 52 రోజులపాటు అభిమానుల్ని క్రికెట్‌ ఫీవర్‌ ఆవరించనుంది.

సీజన్‌ సంవత్సరం విజేత రన్నరప్‌ ఆరెంజ్‌ క్యాప్‌ పర్పుల్‌ క్యాప్‌
1 2008 రాజస్థాన్‌ రాయల్స్ చెన్నై సూపర్‌ కింగ్స్ షాన్‌ మార్ష్ సొహైల్‌
2 2009 డెక్కన్‌ చార్జర్స్ రాయల్స్‌ బెంగళూరు మాథ్యూ హేడెన్ ఆర్‌పీ సింగ్‌
3 2010 చెన్నై సూపర్‌కింగ్స్ ముంబై ఇండియన్స్ సచిన్‌ టెండుల్కర్ ప్రజ్యాన్‌ ఓజా
4 2011 చెన్నై సూపర్‌కింగ్స్ రాయల్స్‌ బెంగళూరు క్రిస్‌ గేల్ లసిత్‌ మలింగ
5 2012 కోల్‌కతా నైట్‌ రైడర్స్ చెన్నై సూపర్‌కింగ్స్ క్రిస్‌గేల్ మోర్నె మార్కెల్‌
6 2013 ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్‌కింగ్స్ మిఖేల్‌ హస్సి డ్వేన్‌ బ్రావో
7 2014 కోల్‌కతా నైట్‌రైడర్స్ కింగ్స్‌లెవన్ పంజాబ్ రాబిన్‌ ఉతప్పు మోహిత్‌ శర్మ
8 2015 ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్‌కింగ్స్ డేవిడ్‌ వార్నర్ డ్వేన్‌ బ్రావో
9 2016 సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఆర్‌సీబీ విరాట్‌ కోహ్లీ భువనేశ్వర్‌ కుమార్‌
10 2017 ముంబై ఇండియన్స్ పుణ సూపర్‌ జైంట్స్ డేవిడ్‌ వార్నర్ భువనేశ్వర్‌ కుమార్‌
11 2018 చెన్నై సూపర్‌ కింగ్స్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విలియమ్సన్‌ ఆండ్య్రూ టై
12 2019 ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్‌కింగ్స్ డేవిడ్‌ వార్నర్ ఇమ్రాన్‌ తాహిర్‌
13 2020 ముంబై ఇండియన్స్ ఢిల్లి క్యాపిటల్స్ కేఎల్‌ రాహుల్ కసిగొ రబాడ
14 2021 చెన్నై సూపర్‌కింగ్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కేఎల్‌ రాహుల్ హర్షల్‌ పటేల్‌
15 2022 గుజరాత్‌ టైటాన్స్ రాజస్థాన్‌ రాయల్స్ జోస్‌ బట్లర్ హార్దిక్‌ పాండ్యా

Advertisement

తాజా వార్తలు

Advertisement