ఐపీఎల్ ప్రారంభమై ప్రతి జట్టు ఒక్కో మ్యాచ్ ఆడేశాయి. అయితే అప్పుడే టాప్ ప్లేస్ కోసం జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే ఢిల్లీ క్యాపిటల్స్ టాప్లో ఉండగా.. కేకేఆర్ సెకండ్ ప్లేస్ లో ఉంది. మొదటి రెండు స్థానాల్లో రెండేసి పాయింట్లతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (+0.779), కోల్‌కతా నైట్‌రైడర్స్ (+0.500) మెరుగైన నెట్ రన్‌రేట్‌తో ఉన్నాయి. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖాతాలోనూ రెండు పాయింట్లు ఉన్నప్పటికీ.. కేవలం +0.050 నెట్ రన్‌రేట్ ఉండటంతో ఆ జట్టు నాలుతో స్థానంతో సరిపెట్టుకుంది. సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధిస్తాయి.
ఫస్ట్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో 2 వికెట్ల తేడాతో ఓడిన ముంబయి ఇండియన్స్ (-0.050).. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలవగా.. పంజాబ్‌పై చివరి బంతి వరకూ పోరాడిన రాజస్థాన్ రాయల్స్ (-0.200) ఆరులో నిలిచింది. ఇక కోల్‌కతా చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (-0.500) ఏడో స్థానంలో.. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ (-0.779) చిట్టచివరి స్థానాల్లో నిలిచాయి.