హైదరాబాద్ – 10 నిముషాల్లో 45 వేల టికెట్స్ ఎలా అమ్ముడు పోతాయ్..? అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో జరిగే ఐపిఎల్ మ్యాచ్ లకు టికెట్స్ దొరకక పోవడం దారుణమన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను డీఎన్ఆర్ అకాడమీని నడుపుతున్నానని తెలిపారు. బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసానని చెప్పారు. హైదరాబాద్ లో టికెట్స్ దొరకక పోవడానికి ప్రధాన కారణం హెచ్ సీ ఏ అన్నారు. హెచ్ సీ ఏ కంప్లమెంటరీ పాస్ బ్లాక్ లో అమ్ముతుందన్నారు. బ్లాక్ మార్కెట్ లో వేలల్లో టిక్కెట్లు అమ్ముకుంటున్నారని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ఉప్పల్ స్టేడియంలో బ్లాక్ మార్కెట్ విక్రయాలు కొనసాగుతున్నాయి.
హెచ్ సీఏ తీరు పై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేస్తామన్నారు. హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ లో హైదరాబాద్ క్రీడా కారుడు ఉండేలా చూడాలని కోరారు. ఇంపాక్ట్ ప్లేయర్ కూడా హైదరాబాద్ క్రీడా కారులు లేకపోవడం దారుణమన్నారు. జెమిని కిరణ్, సన్ రైజర్స్ ఫ్రాంచజీ మొత్తం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10 నిముషాల్లో 45 వేల టికెట్స్ ఎలా అమ్ముడుపోతాయ్? అని ప్రశ్నించారు. టికెట్స్ పారదర్శకంగా అమ్మకాలు జరగాలన్నారు. బ్లాక్ టికెట్స్ దందా పై వచ్చే మ్యాచ్ లలో జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు..