ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీసుకున్న తాజా నిర్ణయంతో వచ్చే ఏడాది నుంచి నిర్వహించే ఐపీఎల్ టోర్నమెంట్ రెండు నెలలపాటు జరుగనుంది. ఐసీసీ 2023-27 ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ)లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సింహభాగాన్ని దక్కించుకుంది. ఐపీఎల్‌తోపాటు ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాస్ లీగ్, ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్‌లు కూడా ఎఫ్‌టీపీలో తమ బెర్తులను పొడిగించుకున్నాయి.
ఈమేరకు ఐసీసీ ఎఫ్‌టీపీని రూపొందించింది. ఐసీసీ తాజా నిర్ణయంతో ఐపీఎల్ మార్చి ఆఖరి వారంలో ప్రారంభమై, జూన్ మొదటి వారంలో ముగియనుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో కొత్తగా రెండు జట్లు చేరడంతో మ్యాచ్‌ల సంఖ్య 60 నుంచి 74కు పెంచారు. ఈ సంఖ్య 2023, 2024 సీజన్లలో అలాగే కొనసాగి 2025, 2026 ఎడిషన్లలో 84కు, 2027 సీజన్‌లో 94కు చేరనుంది. ఐపీఎల్ విండో పొడిగించినప్పటికీ, ఫ్రాంచైజీల సంఖ్య పెంచే ఆలోచే లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.