Friday, November 22, 2024

IPL : ముంబ‌యిపై ఢిల్లీ విజ‌యం.. 18.2 ఓవర్లలో ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్

బ‌లమైన ముంబయి ఇండియన్స్ జట్టుకు సొంతగడ్డపై ఓటమి ఎదురైంది. ముంబయి బ్రాబౌర్న్ స్టేడియంలో ఇవాళ జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో ముంబయి జట్టుపై విజ‌యం సాదించింది. ముంబయి విసిరిన 178 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓ దశలో 72 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా, లలిత్ యాదవ్ (48 నాటౌట్), శార్దూల్ ఠాకూర్ (11 బంతుల్లో 22), అక్షర్ పటేల్ (17 బంతుల్లో 38 నాటౌట్) రాణించడంతో ఢిల్లీ గెలుపు తీరాలకు చేరింది.

ముఖ్యంగా అక్షర్ పటేల్ ఆఖర్లో చిచ్చరపిడుగులా చెలరేగాడు. అతడి స్కోరులో 2 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. అక్షర్ ఇచ్చిన క్యాచ్ ను టిమ్ డేవిడ్ నేలపాలు చేయడం ముంబయికి ప్రతికూలంగా మారింది. ఆ తర్వాత అక్షర్ విజృంభణతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. మరో 10 బంతులు మిగిలుండగానే ఢిల్లీ జయభేరి మోగించింది. ముంబయి బౌలర్ డానియల్ సామ్స్ విసిరిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఢిల్లీ ఆటగాళ్లు ఏకంగా 24 పరుగులు పిండుకున్నారు. అంతకుముందు ముంబయి జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసింది.

ఐపీఎల్ లో నేటి రెండో మ్యాచ్: బెంగళూరుపై టాస్ గెలిచిన పంజాబ్

ఐపీఎల్ లో నేటి రెండో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement