Sunday, November 24, 2024

IPL | చెన్నై సూపర్ విన్.. తొలి మ్యాచ్ సీఎస్‌కేదే..

ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా ఇవ్వాల (శుక్ర‌వారం) జ‌రిగిన తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే విజ‌యం సాధించింది. 174 ప‌రుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నై జట్టు 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలుపొందింది. తొలి బంతినుంచే బౌండరీలతో దూకుడుగా ఆడిన సీఎస్‌కే… వికెట్లు పడుతున్న రన్‌రేట్ పడిపోకుండా ఆడింది. దీంతో 4 వికెట్ల నష్టానికి 18.4 ఓవర్లలోనే టార్గెన్‌ను చేధించింది.

రుతురాజ్ గైక్వాడ్ (15), రచిన్ రవీంద్ర (37), అజింక్యా రహానే (27), డారిల్ మిచెల్ (22), శివమ్ దూబే 34 (నాటౌట్), రవీంద్ర జడేజా 25 (నాటౌట్) ఆకట్టుకున్నారు. ఇక ఆర్సీబీతో బౌలర్లలో కామెరాన్ గ్రీన్ 2 వికెట్లు తీయగా.. కర్ణ్ శర్మ, యశ్ దయాళ్ చరో వికెట్ దక్కించుకున్నారు.

- Advertisement -

అంతక ముందు ఆర్సీబీ బ్యాటింగ్‌లో కెప్టెన్ డుప్లెసిస్ 35 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రజత్, మ్యాక్స్‌వెల్ వరుసగా డకౌట్ అయ్యి నిరాశపర్చారు. కోహ్లీ 21 పరుగులు, కెమరాన్ గ్రీన్ 18 పరుగులు చేసి వెనుదిరిగారు. ఇక అనుజ్ రావత్ (48) పరుగులతో చెలరేగగా.. దినేష్ కార్తీక్ (38- నాటౌట్) పరుగులతో ఆకట్టుకున్నాడు. సీఎస్‌కే బౌటర్లలో దీపక్ చాహర్ ఒక వికెట్ దక్కించుకోగా… ముస్తాఫిజుర్ రెహమాన్ 4 వికెట్లతో మెరిసాడు. కాగా, 174 పరుగల టార్గెట్‌తో చెన్నై జట్టు బరిలోకి దిగనుంది.

రన్ మెషీన్ విరాట్..

ఇక రన్ మెషీన్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్లో అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఈ ఫార్మాట్ చరిత్రలోనే 12 వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ఇవ్వాల్టి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై కోహ్లీ 21 పరుగులు చేశాడు.

ఓవరాల్ గా టీ20 ఫార్మాట్లో 12 వేల పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ 6వ స్థానంలో ఉన్నాడు. ఇందులో అంతర్జాతీయ టీ20 పరుగులతో పాటు, ఫ్రాంచైజీ క్రికెట్లో చేసిన పరుగులు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ 14,562 పరుగులతో నెంబర్ వన్ గా ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ (13,360), వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ కైరన్ పొలార్డ్ (12,900), ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ (12, 319), ఆసీస్ డైనమిక్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (12,065) ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement