వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాను చాంపియన్ గా నిలిపిన ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ , పాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఎల్ వేలంలో చరిత్ర సృష్టించారు.. ఒకరు 20.50 కోట్లకు, మరోకరు రూ.24.75 కోట్లకు అమ్ముడుపోయారు… దుబాయ్ లో జరుగుతున్న మినీ వేలంలో కమిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా నిలిచాడు.. హోరాహోరీగా సాగిన వేలం పాటలో కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్ల రికార్డు ధరతో చేజిక్కించుకుంది.
వేలంలో కమిన్స్ కోసం సన్ రైజర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు హోరాహోరీ తలపడ్డాయి. ప్యాట్ కమిన్స్ కనీస ధర రూ.2 కోట్లు కాగా…. సన్ రైజర్స్, బెంగళూరు ఫ్రాంచైజీలు వేలంలో ఎక్కడా తగ్గకపోవడంతో పాట అమాంతం పెరిగిపోయింది.
సన్ రైజర్స్ యజమాని కావ్యా మారన్ ఆసీస్ కెప్టెన్ కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధమన్న సంకేతాలు పంపారు. దాంతో, చూస్తుండగానే కమిన్స్ రేటు రూ.20.50 కోట్ల మార్కుకు చేరుకుంది. ఆ తర్వాత ఆర్బీబీ వేలం నుంచి విరమించుకోవడంతో, ఈ ఆసీస్ చాంపియన్ కెప్టెన్ సన్ రైజర్స్ వశమయ్యాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు అత్యధిక ధర రికార్డు ఇంగ్లండ్ యువ ఆల్ రౌండర్ శామ్ కరన్ పేరిట ఉంది. 2023 సీజన్ కోసం శామ్ కరన్ ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడా రికార్డును ప్యాట్ కమిన్స్ బద్దలుకొట్టాడు.
తాజాగా ప్యాట్ కమిన్స్ రికార్డ్ ధరను అస్ట్రేలియా స్పీడ్ స్టర్ మిచెల్ స్టార్క్ బ్రేక్ చేశాడు.. కోల్ కోత నైట్ రైడర్స్ అతడిని ఏకంగా రూ.24.75 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి యూపీ కుర్రాడు..
యూపీ బ్యాటర్ సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. గుజరాత్ టైటాన్స్ ఓ దశలో పోటీ పడినా చివరకు సీఎస్‌కే రూ.8.40 కోట్లకు దక్కించుకుంది.
ఊహించని ధర పొందిన అన్ క్యాపెడ్ శుభమ్ డూబే..
రూ. 20 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన శివం డూబే కోసం హోరోహోరీ పోరు జరిగింది. చివరకు రాజస్థాన్ రాయల్స్ టీం రూ.5.80 కోట్లకు దక్కించుకుంది.
స్మిత్‌కు మొండి చేయి..
ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన స్మిత్‌ను కొనడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు.
ఈ సీజన్ లో అమ్ముడుపోని తొలి ఆటగాడిగా కరుణ్ నాయర్ నిలిచాడు. భారత్‌కు చెందిన కరుణ్ నాయర్‌ను కొనడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. మరో భారత ఆటగాడు మనీష్ పాండేను కూడా ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.
పంజాబ్‌కు బెంగళూరు ఫాస్ట్ బౌలర్
భారత ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, లక్నో ఫ్రాంచైజీలు పోటీ పడగా పంజాబ్ రూ.11.75 కోట్లకు పటేల్ ను కొనుగోలు చేసింది.
ముంబైకు గెరాల్డ్ కోయెట్జీ
దక్షిణాఫ్రికాకు లేటెస్ట్ సెన్సేషన్ గెరాల్డ్ కోయెట్జీ జాక్ పాట్ కొట్టాడు. వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించిన ఈ ఫాస్ట్ బౌలర్‌ను ముంబై ఇండియన్స దక్కించుకుంది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ను దక్కించుకోవడానికి ముంబై, చెన్నై పోటీపడ్డాయి. లక్నో కూడా చివరిదాకా ప్రయత్నించింది. అయితే ఆఖరికి ముంబై ఐదు కోట్లకు సొంతం చేసుకుంది.
ముంబై గూటికి గెరాల్డ్ కోయెట్జీ..
దక్షిణాఫ్రికాకు చెందిన గెరాల్డ్ కోయెట్జీ రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగాడు. అతని కోసం ముంబై, చెన్నై పోరాడాయి. మధ్యలో లక్నో కూడా చేరింది. కానీ చివరికి ముంబై ఐదు కోట్లకు దక్కించుకుంది.
శార్దూల్ ఠాకూర్‌ను దక్కించుకున్న చెన్నై..
మొదట్లో శార్దూల్ ఠాకూర్‌పై ఎవరూ వేలం వేయలేదు. రూ.2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి వచ్చిన శార్దుల్‌పై చెన్నై తొలి బిడ్ వేసింది. చెన్నై, సన్‌రైజర్స్ పోటాపడినా.. ఎట్టకేలకు చెన్నై రూ.4 కోట్లకు దక్కించుకుంది.
ధోని టీంలోకి న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర
న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర బేస్ ధర రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చాడు. చెన్నై, ఢిల్లీ పోటీపడినా.. రూ.1.80 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది.
వనిందు హసరంగాను సొంతం చేసుకున్న హైదరాబాద్..
రెండవ సెట్ వేలం మొదలైంది. మొదటి ఆటగాడు వనిందు హసరంగా బేస్ ధర 1.5 కోట్లతో వేలంలోకి వచ్చాడు. LPLలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌ని పొందిన తర్వాత శ్రీలంక ఆల్‌రౌండర్ గాయం కారణంగా ప్రపంచ కప్‌నకు దూరమయ్యాడు. SRH ఓపెనింగ్ బిడ్‌ని చేసింది. అలాగే ముగింపు బిడ్ కూడా హైదరాబాద్ దే కావడం విశేషం. దీంతో హసరంగాను బేస్ ధరకు హైదరాబాద్ కైవసం చేసుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటిక టీమిండియా బౌలర్..
జయదేవ్ ఉనద్కత్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ వేలాన్ని ప్రారంభించాయి. బేస్ ధర రూ.50 లక్షలతో మొదలై.. రూ. 1.60 కోట్లకు చేరింది. ఇదే ధరకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.
ముంబై చెంతకు లంక బౌలర్..
దిల్షాన్ మధుశంక కోసం లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ పోరాడాయి. చివరకు ఈ లంక బౌలర్‌ను ముంబై రూ. 4.60 కోట్లకు దక్కించుకుంది.
గుజరాత్‌కు అజ్మతుల్లా
అజ్మతుల్లా ఒమర్జాయ్‌ను రూ.50 లక్షల బేస్ ప్రైజ్ ధరకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది…
సన్ రైజర్స్ టీమ్ లో ట్రావిస్ హెడ్
ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ బేస్ ధర రెండు కోట్లు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి వేలం వేయగా, ఆపై ప్రస్తుత విజేత చెన్నై సూపర్ కింగ్స్ వేలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్లేయర్ కోసం వేలం పోటాపోటీ జరిగింది. రూ.6 కోట్లు దాటింది. చివరకు రూ.6.80 కోట్లకు హైదరాబాద్ కొనుగోలు చేసింది.
ఢిల్లీ చేరిన హ్యారీ బ్రూక్..
ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అతని కోసం మొదటి బిడ్ చేసింది. ఢిల్లీతో పాటు రాజస్థాన్, బ్రూక్ కోసం పోరాడింది. ఢిల్లీ బ్రూక్ ను రూ.4 కోట్లకు చేర్చుకుంది. గత వేలంలో బ్రూక్‌ను 13.25 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అయితే ఈసారి విడుదల చేసింది
రాజస్థాన్ టీమ్ లో రోమన్ పావెల్..
వెస్టిండీస్ ప్లేయర్ రోమన్ పావెల్ రాజస్థాన్ రాయల్స్ టీంలో చేరాడు. రూ.7.40 కోట్లకు ఈ టీం దక్కించుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ లోకి డారిల్ మిచెల్
న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. కోటి రూపాయల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన ఈ ప్రపంచ కప్ హీరోను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ బాగా ఆసక్తి చూపాయి. అయితే చెన్నై ఏకంగా రూ. 14 కోట్లు వెచ్చింది ఈ స్టార్ ఆల్ రౌండర్ ను సొంతం చేసుకుంది.
పంజాబ్ జట్టులోకి ఇంగ్లాండ్ ఆల్ రౌండర్..
ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ వోక్స్‌ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం ఫ్రాంచైజీ రూ.4 కోట్లు చెల్లించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా వోక్స్ కోసం పోటీపడినప్పటికీ పంజాబ్ నే ఈ స్టార్ ఆల్ రౌండర్ ను దక్కించుకుంది.
స్టబ్స్‌కు రూ.50 లక్షలు
దక్షిణాఫ్రికాకు చెందిన వికెట్ కీపర్ ట్రిస్టాన్ స్టబ్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.50 లక్షలకు దక్కించుకుంది.
చేతన్ సకారియాకు రూ.50 లక్షలు
టీమిండియా స్పిన్నర్ చేతన్ సకారియాను రూ.50 లక్షల కనీస ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది
అల్జారీ జోసెఫ్‌కు రూ.11.5 కోట్లు
వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్‌ను రూ.11.5 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది
ఉమేష్ యాదవ్‌కు రూ.3.4 కోట్లు
టీమిండియా బౌలర్ ఉమేష్ యాదవ్‌ను రూ.3.4 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది
శివం మావికి రూ.6.4 కోట్లు
భారత్‌కు చెందిన బౌలర్ శివం మావిని రూ.6.4 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది.