ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ కొత్త కోచ్‌గా జింబాబ్వే మాజీ స్టార్ క్రికెటర్ ఆండీ ఫ్లవర్‌ను ఎంపిక చేసింది. దీంతో ఇప్పటివరకు ఉన్న సంజయ్ బంగర్‌తో పాటు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హసన్‌పై వేటు పడింది. వీరిద్దరి కాంట్రక్టు సెప్టెంబర్‌లో ముగియనుంది. ముందు వారిద్దరి కాంట్రక్టును పొడింగించాలని భావించిన ఆర్‌సీబీ.. తర్వాత తమ నిర్ణయాన్ని మార్చేసి కొత్త కోచ్‌ను నియమించుకుంది.
ఐపీఎల్‌లో ఆర్‌సీబీ జట్టు ఒక్క సారి కూడా టైటిల్ సాధించలేదు. ఈసారైనా ఆండీ ఫ్లవర్ వీరి తలరాతను మార్చుతాడేమో చూడాలి. స్టార్ ఆటగాళ్లతో కూడిన ఆర్‌సీబీకి ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలిఉంది. గత సీజన్‌లో విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా తప్పించి కొత్త సారథిని నియమించినా ప్రయోజనం లేకుండా పోయింది. కోహ్లీ, ఎబీ డివిలయర్స్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్న కూడా ఈ జట్టు విజేతగా నిలవలేక పోయింది.
ఇక కొత్త కోచ్‌తో కోత్త సీజన్ ఎలా ఆడుతారో ఆగి చూడాల్సిందే. ఫ్లవర్‌కి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల కోచింగ్ స్టాఫ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోత్త కోచ్‌గా నియమితుడైన సందర్భంగా ఆండీ ఫ్లవర్ మాట్లాడుతూ.. ప్రధాన కోచ్‌గా ఎంపిక అవడం సంతోషంగా ఉంది.
మరోవైపు ఇది ఎంతో బాధ్యతమైన పదవి. వచ్చే సీజన్‌లో ఆర్‌సీబీని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాను. ఈ జట్టులో మంచి అనుభవం ఉన్న క్రికెటర్లు ఉన్నారు. వారందరితో కలిసి పనిచేయటం చాలా ఉత్సాహంగా ఉందని ఫ్లవర్ అన్నాడు. ఈసారైన ఆర్‌సీబీ ఛాంపియన్‌గా నిలుస్తుందేమో చూడాలి.