Tuesday, November 19, 2024

IPL 2022: నేటి నుంచి ఐపీఎల్ సమరం..తొలి మ్యాచ్ లో చెన్నైతో కోల్ కతా ఢీ

క్రీడా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ )కు సర్వం సిద్ధమైంది. కోవిడ్ కారణంగా గత రెండు సీజన్లు యూఏఈ వేదికగా జరిగాయి. తాజాగా ఐపీఎల్-15వ సీజన్ నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఇంతకముందు ఉన్న ఎనిమిది జట్లకు తోడుగా మరో రెండు జట్లు వచ్చి చేరాయి. ఈసారి కొత్తగా గుజరాల్ టైటాన్స్, లక్నో సూపర్ జాయింట్స్ చేరడంతో జట్ల సంఖ్య 10కి చేరింది.

నేడు ప్రారంభం అయ్యే మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరనుంది. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. రేపు ముంబైలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తరలపడతాయి. డీవై పాటల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తలపడనున్నాయి.  ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఆరంభానికి రెండు రోజుల ముందు ధోని తాను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. దీంతో రవీంద్ర జడేజా ఆఖరి నిమిషంలో కెప్టెన్‌ అయ్యాడు. తన 13 ఏళ్ల కెరీర్‌లో జడేజా ఏనాడు ఒక్క మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించలేదు. మరి అనుభవం లేని జడేజా సీఎస్‌కే ఎలా ముందుకు నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. 

కాగా, మొత్తం 65 రోజుల పాటు 70 లీగ్ మ్యాచులు, 4 ప్లే ఆఫ్ మ్యాచులు జరగనున్నాయి. ముంబై, పుణేల్లోనే నాలుగు స్టేడియాల్లో ఈ మ్యాచులన్నీ జరుగనున్నాయి. దీనికి తోడుగా 25 శాతం మందిని స్టేడియాల్లోకి అనుమతి ఇస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోవడంతో అభిమానుల సంబరాలు చెసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement