Saturday, November 23, 2024

ఇండియలోనూ ఐ ఫోన్‌ తయారీ..

యాపిల్‌ కంపెనీ ఐ ఫోన్‌ను చైనాతో పాటు మన దేశంలోనూ తయారు చేయనుంది. ఐఫోన్‌ 14 సీరిస్‌ ఫోన్‌ను సెప్టెంబర్‌లో మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఇటివల ఏర్పడిన రాజకీయ భౌగోళిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని యాపిల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తిగా చైనాపై ఆధారపడటం వల్ల సమస్యలు వస్తున్నాయని గుర్తించిన యాపిల్‌ ప్రత్యామ్నాయంగా ఇండియలోనూ ఐ ఫోన్‌ తయారు చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ నిర్ణయించినట్లు ఇండస్ట్రీ విశ్లేషకుడు మింగ్‌ ఛై కూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఐ ఫోన్‌ 14, ఐఫోన్‌ మ్యాక్స్‌, ఐఫోన్‌ 14 ఫ్రో ఫోన్లను భారత్‌లో తయారు చేయనుంది.

ఇండియాలో ఉన్న ఫాక్స్‌కాన్‌ తయారీ సెంటర్‌ నుంచే ఐఫోన్లను తయారు చేయనున్నారు. చైనా బయట ఐఫోన్‌ తయారు చేయాలని కంపెనీ తీసుకున్న నిర్ణయం ఈ కంపెనీ చరిత్రలో మైలురాయి వంటిదని ఆయన అభిప్రాపడ్డారు. ఐఫోన్‌ 14ను రేటును 13 మోడల్‌లాగే 799 డాలర్లకు ధరలో లాంచ్‌ చేయనుంది. మన ఇండియన్‌ కరెన్సీలో ఇది సుమారు 64 వేల రూపాయలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement