టెక్ దిగ్గజం ఐఫోన్ నుంచి 2021 సెప్టెంబర్ లో రిలీజ్ చేసిన iPhone 13 గత ఏడాది (2022) ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా అవతరించింది. గత ఏడాది ఐఫోన్ అమ్మకాలలో ఐఫోన్ 13 28%గా ఉన్నట్టు USలోని కుపెర్టినో ఆధారిత సాంకేతిక సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ గ్లోబల్ మంత్లీ హ్యాండ్‌సెట్ మోడల్ సేల్స్ ట్రాకర్ నివేదిక వెల్లడించింది.
గతేడాది సెప్టెంబర్‌లో ప్రైజ్ డ్రాప్ కారణంగానే ఐఫోన్ 13 అమ్మకాలు పెరిగాయని తెలుస్తుంది. ఐఫోన్ 13 ఫ్రాన్స్, జర్మనీ, యుఎస్, యుకె & చైనాతో సహా అనేక దేశాలలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ గా నిలిచింది.
గత ఏడాది 2022లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 ఫోన్‌ల లిస్ట్ లో మొత్తం 8 Apple స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. మార్కెట్ పరిశోధనల ప్రకారం ఐఫోన్ 13 మొదటి స్థానంలో నిలువగా.. ఐఫోన్ 13 Pro Max రెండవ స్థానంలో, iPhone 14 Pro Max మూడవ స్థానంలో ఉన్నట్లు గ్లోబల్ మంత్లీ హ్యాండ్‌సెట్ మోడల్ సేల్స్ ట్రాకర్ నివేదిక వెల్లడించింది. ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 12, ఐఫోన్ 14 & ఐఫోన్ 14 ప్రో వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచాయి. ఈ ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, పాకెట్-ఫ్రెండ్లీ ఐఫోన్ SE తొమ్మిదవ స్థానంలో ఉంది.
2022లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఏకంగా ఎనిమిది స్థానాలను ఆక్రమించిన ఏకైక బ్రాండ్‌గా Apple నిలిచింది. లిస్ట్ లో Samsung రెండు స్థానాలను పొందింది, Samsung Galaxy A13 నాల్గవ అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. మరో Samsung Galaxy సిరీస్ ఫోన్ Samsung A03 పదవ స్థానాన్ని ఆక్రమించింది.