ఐఫోన్ ప్రియుల కోసం ఆపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్‌ను ప్రారంభించింది. iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Plus పేర్లతో 4 కొత్త ఐఫోన్ మోడల్‌లను ఆపిక్ కంపెనీ లాంచ్ చేసింది. 6 కలర్ ఆప్షన్‌లతో వస్తున్న ఈ సరికొత్త ఫోన్లలో యాపిల్ అడ్వాన్స్‌డ్ స్పెసిఫికేషన్స్ అందించింది. పాత తరం ఫీచర్లను అప్‌గ్రేడ్ చేసింది. మోడల్ వారీగా ఈ నాలుగు కొత్త ఐఫోన్ల ప్రత్యేకతలు తెలుసుకుందాం..
బేసిక్ ఎడిషన్స్
కొత్త సిరీస్‌లోని ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడళ్లు పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. ఈ డివైజ్‌లను 128GB, 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లలో సొంతం చేసుకోవచ్చు. భారత్‌లో వీటి ధరలు వరుసగా రూ.79,900, రూ.89,900 నుంచి ప్రారంభమవుతాయి.
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడళ్లు రెండూ డైనమిక్ ఐలాండ్ ఫీచర్, 48MP ప్రైమరీ కెమెరా, A16 బయోనిక్ చిప్‌సెట్, USB-C పోర్ట్.. వంటి ఫీచర్లతో వచ్చాయి. యాపిల్ కంపెనీ ఈ సిరీస్‌తో మొదటిసారి USB-C పోర్టుతో ఐఫోన్లను డిజైన్ చేసింది. ఈ లేటెస్ట్ USB టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉన్న ఫస్ట్ జనరేషన్ యాపిల్ డివైజ్‌లుగా ఐఫోన్ 15 మోడళ్లుగా నిలిచిపోనున్నాయి.
ప్రో వేరియంట్స్
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రెండూ కొత్త యాక్షన్ బటన్, A17 Pro చిప్, తేలికపాటి టైటానియం డిజైన్, USB-C పోర్ట్‌తో వచ్చాయి. ఐఫోన్ 15 ప్రో ధర రూ.1,34,900 నుంచి ప్రారంభమవుతుంది. ఈ డివైజ్ 128GB, 256GB, 512GB, 1TB స్టోరేజ్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
వేరియంట్‌ను బట్టి ధర పెరుగుతుంది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వేరియంట్ ధర రూ.1,59,900 నుంచి ప్రారంభమవుతుంది. సిరీస్‌లో ఇదే హై ఎండ్ మోడల్. ఈ డివైజ్ 256GB, 512GB, 1TB స్టోరేజ్ కెపాసిటీతో లభిస్తుంది.
త్వరలోనే బుకింగ్స్..
లేటెస్ట్ సిరీస్ ఐఫోన్లు అమెరికాతో పాటు కొన్ని గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లు భారత్‌లో సైతం అందుబాటులో ఉంటాయి. ఇండియన్ కస్టమర్లు ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను ఈ శుక్రవారం, సెప్టెంబర్ 15 సాయంత్రం 5:30pm నుంచి ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. వీటి సేల్స్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమవుతాయి.