యాపిల్ కంపెనీ నుంచి మార్కెట్ లో గతవారం ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ లైనప్‌లో మొత్తం నాలుగు ఐఫోన్లను రూపొందించింది కంపెనీ. ఇక ఇండియన్ మార్కెట్ లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడళ్ల ప్రీ ఆర్డర్లు సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యాయి. కాగా, వీటి అమ్మకాలు సెప్టెంబర్ 22 (శుక్రవారం) నుంచి ప్రారంభమవుతాయని యాపిల్ ప్రకటించింది. మరి ఈ లేటెస్ట్ ఫోన్లపై వివిధ ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్స్ అందిస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలు చూద్దాం..
ఫ్లిప్‌కార్ట్
ఇ-కామర్స్ స్టోర్ ఫ్లిప్‌కార్ట్ సైతం ఐఫోన్ 15 సిరీస్‌పై బెస్ట్ ఆఫర్లను అందిస్తోంది. ప్రీ-ఆర్డర్ చేయడంపై స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ప్రకటించింది. నెలకు రూ.13వేల ఈఎంఐతో ఈ పోర్టల్‌లో ఐఫోన్ 15ను కొనుగోలు చేయవచ్చు. అయితే ప్రస్తుతానికి ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ఐఫోన్లు అందుబాటులో లేవు. త్వరలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని పోర్టల్ పేర్కొంది.
అమెజాన్
ఐఫోన్ 15 సిరీస్ మోడళ్లపై అమెజాన్ బెస్ట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ప్లాట్ఫామ్లో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు హోల్డర్లు కొత్త ఐఫోన్లను ఆర్డర్ చేస్తే.. రూ. 5,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. సెప్టెంబర్ 23 నుంచే అమెజాన్ కస్టమర్లకు ఐఫోన్లను డెలివరీ చేస్తుంది. ఐఫోన్ 15 షిప్‌మెంట్స్ ఆలస్యం అవుతాయని నివేదికలు చెబుతున్నా, ఫాస్టెస్ట్ డెలివరీకి అమెజాన్ హామీ ఇస్తోంది.
క్రోమా
క్రోమా ఫిజికల్ స్టోర్స్‌లో ఐఫోన్ 15పై మంచి ఆఫర్లు ఉన్నాయి. ఐఫోన్ 15 మోడళ్లపై ఈ బ్రాండ్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది. క్రోమా స్టోర్‌లో ఐఫోన్ 15ను రూ. 2,000తో ప్రీబుక్ చేయవచ్చు. HDFC క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసినా లేదా EMI ఆప్షన్ సెలక్ట్ చేసుకున్నా.. iPhone 15, iPhone 15 Plus సేల్‌పై రూ.5,000 డిస్కౌంట్ పొందవచ్చు. ప్రో మోడళ్లపై రూ. 4,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ ఉంది. ఏదైనా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. రూ. 6,000 వరకు అదనపు డిస్కౌంట్ సైతం ఉంటుంది.
విజయ్ సేల్స్
ఐఫోన్ 15 మోడళ్లపై విజయ్ సేల్స్ ఆకర్షించే బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. కొత్త సిరీస్ ఐఫోన్లను HDFC క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారు నో-కాస్ట్ EMI ఆప్షన్‌తో పాటు రూ.4,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అలాగే HSBC క్రెడిట్ కార్డ్ EMIని పేమెంట్ ఆప్షన్‌గా సెలక్ట్ చేసుకున్న కస్టమర్లకు రూ.7,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. YES బ్యాంక్ క్రెడిట్ కార్డు EMI ఆప్షన్ మీ పేమెంట్ మోడ్ అయితే, 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ (అత్యధికంగా రూ.2,000 వరకు) పొందవచ్చు.