ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పెట్రోల్ అమ్మకాలపై లీటర్‌కు 10 రూపాయిలు, డీజిల్‌పై 14 రూపాయిలు నష్టపోతోంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారీ నష్టాలను నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో ఐఓసీ 1992.53 కోట్ల రూపాయి నష్టాలను ప్రకటించింది. గత సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ 5,941.37 కోట్లు, నికర లాభం ప్రకటించింది. రిఫైనరీ మార్జిన్ బ్యారెల్‌కు 31.8 డాలర్లు ఉన్నప్పటికీ నష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. రిటైల్ అమ్మకాల్లో పెట్రోల్‌పై 10, డీజిల్‌పై 14 రూపాయల నష్టంతో లాభాల్లో క్షిణత ఏర్పడిందని తెలిపింది.
ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం వల్ల 1500 నుంచి 1600 వరకు నష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. మార్కెట్ ధరలకు అనుగుణంగా కంపెనీలకు రేట్లను సవరించే అధికారం ఉన్నప్పటికీ చాలా నెలల పాటు రేట్లను సవరించలేదు. ఫలితంగా ఆయిల్ కంపెనీలు ఈ త్రైమాసికంలో నష్టాలను ఎదుర్కొన్నాయి. దీని వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌కు 109 డాలర్లకు చమురును దిగుమతి చేసుకుంటున్న సంస్థలు , రిటైల్ గా మాత్రం బ్యారెల్‌కు 85-86 డాలర్లకు విక్రయిస్తున్నాయి. ఫలితంగా నష్టాలను ఎదుర్కొంటున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.