అమరావతి, ఆంధ్రప్రభ : జాతీయ విపత్త్తు నిర్వహణ సంస్థ వారు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థలో శిక్షణ పొందిన యువతి యువకులకు (18 నుండి 40 సంవత్సరములలోపు ఉన్న వారికీ) యువ ఆపద మిత్ర పధకానికి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రకృతి వైపరీత్యాలు (వరదలు, భూకంపాలు, సునామీ వంటివి) సంభవించినప్పుడు జాతీయ విపత్త్తు నిర్వహణ సంస్థతో పాటు- సహాయము చేయుటానికి జాతీయ విపత్త్తు నిర్వహణ సంస్థ వారు ఆసక్తి కల యువతి యువకులకు ఒక 7 రోజులు శిక్షణ శిబిరమును నిర్వహిస్తార ని తెలిపారు.
శిక్షణ పూర్తి చేసిన యువతీ యువకులకు – అత్యవసర పరికరముల కిట్ ఇవ్వనున్నట్లు తెలిపారు.శిక్షణ పూర్తి చేసిన యువతీ యువకులను 3 సంవత్సరముల లైఫ్ అమడ్ హెల్త్ ఇన్సురెన్స్ చేస్తారన్నారు. దరఖాస్తు చేసుకునే వారు 18 నుండి 40 సంవత్సరముల వయస్సు కలిగి సంబంధిత జిల్లా వాసి అయి ఉండాలన్నారు. ఆసక్తి కల విద్యార్థులను యువ ఆపద మిత్ర పధకము నందు ఆన్‌లైన్ లో నమోదు చేసుకోవల ని కమిషనర్ కోరారు.