హైదరాబాద్, (ప్రభ న్యూస్) : హైదరాబాద్ లో శాంసంగ్ ఇండియా నిర్వహించిన ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ రోడ్ ప్రదర్శనలో కళాశాలకు చెందిన యువ విద్యార్థులు ముందుకు వచ్చి రాష్ట్రంలో, దేశంలో ప్రజలు, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించారు. సాల్వ్ ఫర్ టుమారో గురించి వాగ్ధానం చేసారు. శాంసంగ్ అంతర్జాతీయ సీఎస్‌ఆర్ కార్యక్రమం సాల్వ్ ఫర్ టుమారో గురించి మాట్లాడేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.
దీనికి హైదరాబాద్ లోని 500 మందికి పైగా విద్యార్థులతో పాటు నగరానికి చెందిన యువ ఆవిష్కరణకర్తలు – ఆరోగ్య సంరక్షణ, సంక్షేమ ఉత్పత్తులు కోసం పని చేసే డాక్టర్. సత్యనారాయణ కూచిభట్ల, సహ స్థాపకులు, పరిశోధన టెక్నాలజీస్, చిన్న రైతులు, భూ యజమానులకు అందుబాటులో ఉండే, సరసమైన సంక్లిష్టమైన వ్యవసాయ సామగ్రిని తయారు చేసేందుకు కృషిచేసిన ఆర్.షణ్ముఖ రావు, ఆవిష్కరణకర్త, సుస్థిరత సంచారం విభాగంలో పని చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి, డేటా సైంటిస్ట్, సహ స్థాపకులు హల మొబిలిటి కూడా హాజరయ్యారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.