హైదరాబాద్ – ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రతినిధుల బృందం నేడు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సచివాలయంలో రేవంత్ రెడ్డితో సమావేశమైన అమెజాన్ బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలపై చర్చించింది. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలను రేవంత్ రెడ్డి అమెజాన్ ప్రతినిధులకు వివరించారు. సచివాలయంలో ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
కైట్ ఫెస్టివల్ కు ఆహ్వానం ..
తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగనుంది. ఈ ఇంటర్నేషనల్ కైట్స్ & స్వీట్స్ ఫెస్టివల్ రావలసిందిగా నిర్వాహకులు ముఖ్యమంత్రి రేవంత్ కు ఆహ్వానం అందించారు.. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొన్నారు..