Tuesday, November 26, 2024

భారత్‌లో పెట్టుబడులు ఓకే.. భారీ పెట్టుబడులకు ప్లాన్‌

అంతర్జాతీయ పరిస్థితులు ప్రపంచ ప్రముఖ కంపెనీలను మన దేశం వైపు చూసేలా చేస్తున్నాయి. మన దేశంలో అన్ని రకాల పరిస్థితులు సానుకూలంగా ఉండటమే ఇందుకు కారణం. అగ్ర రాజ్యాలుగా ఎదిగిన చాలా దేశాలు ఇప్పుడు ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్నాయి. చైనాలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైంది. అమెరికా ఆర్థిక మాంధ్యం ముంగిట్లో ఉంది. రష్యా-ఉక్రెయిన్‌ సంక్షభంతో ఐరోపా దేశాలు సతమతం అవుతున్నాయి. ఆర్థికంగా ఈ దేశాల పరిస్థితి నానాటికి దిగజారుతోంది. అమెరికా మటలు విని రష్యాపై ఆంక్షలు పెట్టడంతో జర్మనీతో సహా అనేక దేశాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రష్యా చమురు, గ్యాస్‌పై ఆధారపడిన ఐరోపా దేశాల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది. ఆయా దేశాలు ఇన్ని సమస్యలతో ఉంటే మన దేశ ఆర్ధిక వ్యవస్థ చాలా వరకు స్థిరంగా ముందుకు సాగుతోంది. అధిక ధరలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ, ఆయా దేశాలతో పోల్చుకుంటే కొంత బెటర్‌గానే ఉన్నాయి. అందుకే ఇప్పుడు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు మన దేశం వై పు చూస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.

ఎయిర్‌టెల్‌లో గూగుల్‌ పెట్టుబడులు
భారతీ ఎయిర్‌టెల్‌లో టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఒక బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఇంతకు ముందే గూగుల్‌ రిలయన్స్‌ జియోలో 4.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. మన దేశంలో సాధ్యమైనంత విస్తరించాలని గూగుల్‌ ప్రయత్నిస్తోంది.

అంకురాల్లో బ్లాక్‌స్టోన్‌ పెట్టుబడులు
అమెరికాకు చెందిన మరో కంపెనీ బ్లాక్‌స్టోన్‌ కూడా మన దేశంలో పెట్టుబడులు పెడుతోంది. ఈ సంస్థ ఇప్పటికే స్టార్ట్‌ప్‌ల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. అంకుర సంస్థలో బ్లాక్‌స్టోన్‌ 25 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ప్రస్తుతం మరో 50 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. గత 10 సంవత్సరాల్లో ఈ కంపెనీ మన దేశంలోని వివిధ సంస్థలు, కంపెనీల్లోకి 22 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు మళ్లించింది. 2021 సంవత్సరం తొలి నాలుగు నెలల్లో ఈ కంపెనీ 5.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీ ప్రధానంగా ప్రెస్టీజ్‌ వంటి గృహోపకరణాల తయారీ కంపెనీలతో పాటు విద్య రంగంలో ఉన్న ఆకాష్‌ సంస్థలోనూ, నెక్సస్‌ మాల్స్‌, పిరమల్‌ గ్లాస్‌, ఎంఫసిస్‌ వంటి పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది.

మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులు
ఇప్పటికే మన దేశంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కేంద్రం కలిగి ఉన్న మైక్రోసాఫ్ట్‌ మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉంది. అమెరికా అవతల మైక్రోసాఫ్ట్‌ మొదటి కేంద్రాన్ని హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసింది. ఇప్పుడు 15 వేల కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మన దేశానికి వచ్చిన అతి పెద్ద ఎఫ్‌డీఐల్లో ఇది రెండోవది. అంతకు ముందు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ మన దేశంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

యాపిల్‌ పెట్టుబడులు
ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఉన్న యాపిల్‌ మన దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే కంపెనీ మన దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టింది. కంపెనీ మన దేశంలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టనుంది. 2021, సెప్టెంబర్‌ త్రైమాసికంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా యాపిల్‌ నిలిచింది. ఈ వేగాన్ని మరింత పెంచాలని కంపెనీ ప్రయత్నిస్తోంది.
ఒరాకిల్‌ విస్తరణకు ప్రణాళికలు ఇప్పటికే మన దేశంలో పని చేస్తున్న ఒరాకిల్‌ కంపెనీ మరింత విస్తృతం కావాలని నిర్ణ ంచింది. క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీగా ఉన్న ఒరాకిల్‌ వరసగా మూడు సంవత్సరాల నుంచి గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలని ఒరాకిల్‌ నిర్ణయించింది.

- Advertisement -

ఎయిర్‌బస్‌, బోయింగ్‌ ఒప్పందాలు
విమానాల తయారీలో అంతర్జాతీయ సంస్థలుగా ఉన్న ఎయిర్‌బస్‌, బోయింగ్‌ మన దేశంలోని విమానయాన సంస్థలతో పలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. మన దేశ విమానయాన రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. దీన్ని అవకాశంగా మార్చుకోవాలని ఈ రెండు సంస్థలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. మన దేశంలోని విమానయాన సంస్థల నుంచి భారీ ఎత్తున విమానాల సరఫరా కాంట్రాక్ట్‌లను దక్కించుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా భారత్‌లో పెట్టుబడులు పెట్టడమే మేలని చాలా కంపెనీలు భావిస్తుండటంతో.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement