Monday, November 18, 2024

స్టాక్‌లో మార్కెట్‌లో పెట్టుబడులు.. పాసివ్‌ స్కీమ్స్ పై పెరుగుతున్న ఆసక్తి

భారత్‌లో నిష్క్రియాత్మక పెట్టుబడుల (పాసివ్‌ ప్రొడక్ట్‌ ్స)కు ఆదరణ పెరుగుతున్నదని, మార్కెట్‌తో అనుసంధానిత రాబడులు, పోర్టు ఫోలియో కూర్పులో పారదర్శకత వంటి పలు ప్రోత్సాహకాలను మదుపరులు అందుకుంటున్నారని యాక్సిస్‌ ఏఎంసీ, ప్రొడక్ట్‌ ్స అండ్‌ ఆల్టర్నేటివ్స్‌ హెడ్‌ అశ్విన్‌పత్ని తెలిపారు. మదుపరుల అభిరుచులకు అనుగుణంగా.. వినూత్న పథకాలు ముందుకు వస్తున్నాయని, ఆ దిశగా ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు అడుగులు వేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో కంపెనీలు ముందంజలో ఉన్నాయని, డిసెంబర్‌ 2021 నాటికి ఏఎంఎఫ్‌ఐ నివేదిక ప్రకారం.. భారత్‌లో దాదాపు 225 పాసివ్‌ స్కీమ్స్‌ ఉన్నాయన్నారు. రాబోయే మరికొన్నేళ్లలో ఇవి భారీగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మదుపరులకు లాభదాయకమైన ప్రతిపాదనగా మార్చిన కీలక అంశాలు గమనిస్తే..

నిఫ్టీ 100, నిఫ్టీ 50..

బ్యాంకెబుల్‌ నిఫ్టీ ఇండెక్స్‌ను చూసుకుంటే.. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆధారంగా.. భారత్‌లోని కంపెనీలు నిఫ్టీ ఇండెక్స్‌లో నిఫ్టీ 100, నిఫ్టీ 50 లేదా నిఫ్టీ నెక్ట్‌ ్స 50 లేదా ఇతర నిఫ్టీ సూచీలుగా విభజించబడ్డాయి. నిఫ్టీ 50 ఇండెక్స్‌ లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ను ట్రాక్‌ చేస్తుంది. వీటిలో అధిక శాతం భారీ బ్లూచిప్‌ కంపెనీలే ఉంటాయి. మరోవైపు నిఫ్టీ నెక్ట్‌ ్స 50 ఇండెక్స్‌.. ఆ కంపెనీల పనితీరును గుణిస్తుంది. అవి తరువాత తరఫు మార్కెట్‌ హెవీ వెయిట్స్‌ సామర్థ్యం ప్రదర్శిస్తుంది. ఇవన్నీ కూడా సెక్టార్‌ డైవర్శిఫికేషన్‌కు వాగ్ధానం చేయడంతో పాటు సంబంధిత ఫోర్ట్‌ ఫోలియోలో అవసరమైన తోడ్పాటును మదుపరులకు అందిస్తుంది.

అనిశ్చితిలోనూ ఆర్థికవృద్ధి..

సెక్టోరల్‌ ఈటీఎఫ్‌లను గమనిస్తే.. అనిశ్చితి పరిస్థితిలో కూడా ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్‌, వినియోగం, సాంకేతికత వంటి రంగాలు వృద్ధి చెందగలవనే వాస్తవాన్ని మహమ్మారి కళ్లముందు ఉంచింది. మనగుడకు అవసరమైనందున వాటిని ఆర్థిక వ్యవస్థ కీలక స్తంభాలుగా కూడా పిలవొచ్చు. ఈ నిష్క్రియాత్మక పెట్టుబడుల ప్రపంచంలో పలు సెక్టోరియల్‌ ఈటీఎఫ్‌లు కూడా భాగంగా ఉన్నాయి. ఇవి పెట్టుబడిదారులను విభిన్న రంగాలు, భౌగోళికాలు, కొన్ని సార్లు పరిశ్రమల్లో కూడా అన్నింటినీ కలుపుకునే విభిన్నమైన పోర్ట్‌ఫోలియోను అనుమతిస్తుంది.

- Advertisement -

5వేలకు పైగా లిస్టింగ్‌ కంపెనీలు..

మన ఎక్స్ఛేంజీలలో 5వేలకు పైగా కంపెనీలు లిస్టు అయినప్పటికీ.. ప్రపంచ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ వాటా పరంగా మాత్రం కేవలం 3 శాతం వాటా మాత్రమే కలిగి ఉన్నాయి. సాంకేతికత, డిజిటలైజేషన్‌ వంటివి మన జీవితాలతో మిళితమైన తరువాత రిటైల్‌ మదుపరునికి అంతర్జాతీయంగా అవకాశాలు తెరుచుకున్నాయి. అదృష్టవశాత్తు మనకు పలు ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఉన్నాయి. ఇవి అంతర్జాతీయ మార్కెట్‌లపై దృష్టి సారించడంతో పాటు అంతర్జాతీయ కంపెనీల శక్తిపై ఆధారపడుతాయి. వీటిలో కొన్ని అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లు అయిన చైనా, తైవాన్‌ మార్కెట్స్‌లోనూ సేవలందిస్తున్నాయి. అంతర్జాతీయంగా పెట్టుబడి అనేది అంతర్జాతీయ అవకాశాలు, తగ్గిన రిస్క్‌, పోర్ట్‌ఫోలియో డైవర్శిఫికేషన్‌, అత్యుత్తమ రిస్క్‌ సర్దుబాటు చేసిన అంతర్జాతీయ రాబడులకు సంబంధించిన నాలుగు రెట్ల ప్రయోజనం అందిస్తుంది. మారుతున్న కాలంతో పాటు మదుపరులకు పెట్టుబడులకు సంబంధించి ప్రతీ అంశంలోనూ ఆవిష్కరణలను డిమాండ్‌ చేయవచ్చు. అది ఆఫరింగ్‌ లేదా ఛానెల్స్‌ ఏదైనా కావొచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement