బుగ్గపై చాలా మందికి డింపుల్స్ ఉండటం చూసే ఉంటారు.. డింపుల్స్ ఉన్న వాళ్లు నవ్వినప్పుడు వారి బుగ్గపై సొట్టలు ఎర్పడటంతో వారి ముఖానికి అందం.. మరింత కళ వస్తుంది.. కొందరైతే డింపుల్స్ ఉండటం ఎంతో అదృంష్టంగా కూడా భావిస్తారు.. అయితే డింపుల్స్ ఎలా ఎర్పడతాయో తెలుసా అంటున్నారు వైద్య పరిశీలకులు.. పుట్టుకకు ముందు చెంపలోని జైగోమాటికస్ మేజర్ అనే కండరం రెండుగా చీలిపోవడం వల్ల ఈ అందమైన సొట్ట బుగ్గలు ఎర్పడతాయట.. ఇలా కండరం చీలి డింపుల్ ఎర్పడటం అనేది ఒక్క డిసార్డరే అయినా.. అదేం అంత హానికరమైనది కాదు అని డాక్టర్లు చెబుతున్నారు.
అయితే.. 1936లో న్యూయార్క్ నగరంలో రోచెస్టర్కు చెందిన ఇసాబెల్లా గిల్బర్ట్ అనే మహిళా డింపుల్స్ పై ఇష్టంతో “డింపుల్ మేకర్” యంత్రాన్నే శ్రుష్టించింది. అయితే ఈ మిషన్ ని బుగ్గలపై కొద్ది రోజుల పాటు ధరించాలి.. అలా అది బుగ్గలపై నొక్కినట్టు అయ్యి రెండు చెంపల మీద డింపుల్ ఎర్పడటానికి ఉపయోగపడుతుంది. కానీ, దినికి విరుద్ధంగా అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాదనకు దిగింది. డింపుల్ మేకర్ బుగ్గలపై డింపుల్స్ తయారు చేయలేదని, అసలు గుంటలను పెద్దదిగా చేయదని వాదించింది. పరికరాన్ని ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల కేన్సర్‌కు దారితీసే ప్రమాదం కూడా ఉందని వారు హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital