Tuesday, November 26, 2024

వీళ్లు నిజంగానే డిగ్రీ చదివారా?

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో చెల్లని ఓట్లు విస్మయానికి గురిచేస్తున్నాయి. ఏడు రౌండ్లు ముగిసే సరికి 21 వేలకు పైగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. అభ్యర్థులతో సమానంగా చెల్లని ఓట్లు రావడం గమనార్హం. పట్టభద్రుల ఓట్లు ఈ స్థాయిలో చెల్లుబాటు కాకపోవడం సిగ్గుచేటని కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు జయసారథి రెడ్డి, చెరుకు సుధాకర్, రాణి రుద్రమ కంటే చెల్లుబాటు కాని ఓట్లు(21,057) ఎక్కువ ఉండడం గమనార్హం. ఓట్లు చెల్లనప్పుడు డిగ్రీ చదివినా ఏం లాభం అంటున్నారు. అసలు వీళ్లు నిజంగా డిగ్రీ చదివారంటారా? అన్నదే అందరి డౌట్.

Advertisement

తాజా వార్తలు

Advertisement