Tuesday, November 19, 2024

అందుబాటులోకి ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్ .. గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభం

కొవిడ్‌19 ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ ఇన్‌కొవాక్‌ ఈ నెల 26 నుంచి ప్రారంభంకానుంది. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రక్రియ ప్రపంచంలోనే మొట్టమొదటిగా రికార్డులో చేర‌నుంది. మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్‌, ఎండీ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. నాసికా వ్యాక్సిన్‌ను గణతంత్ర దినోత్సవం రోజు (జనవరి 26)న అధికారికంగా ప్రారంభించనున్నామని తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో ప్రాథమిక 2 డోస్‌ షెడ్యూల్‌, హెటెరోలాగస్‌ బూస్టర్‌ డోస్‌కు ఆమోదం పొందేందుకు సంస్థకు ఆమోదం లభించింది. అంతకు ముందు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీఓ), 18 ఏళ్లు లేదా అంతకంటే పైబడిన వయసున్న వారిలో అత్యవసర పరిస్థితుల్లో ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ను తీసుకోడానికి ఆమోదించింది.

ప్రపంచంలోని మొట్టమొదటి కొవిడ్‌19 ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ని అధికారికంగా ప్రారంభించేందుకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇన్‌కొవాక్‌ వ్యాక్సిన్‌ 18 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చే బూస్టర్‌ డోస్‌. భారత్‌ బయోటెక్‌ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించబడిన ఒక్కో మోతాదుకు రూ. 325(జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రైవేటు ఆస్పత్రులు, వాక్సిన్‌ కేంద్రాలు రూ.800(జీఎస్టీ అదనం) చెల్లించాలి.

ఎలా నమోదు చేసుకోవాలి ?

కొవిన్‌ వెబ్‌సైట్‌ను ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ మోతాదు కోసం అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోవాలి. నమోదిత మొబైల్‌ నంబర్‌తో లాగిన్‌ చేసి, మీ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. తర్వాత స్లాట్‌ను ఎంచుకోవాలి. 18 ఏళ్లు పైబడినవారు ఎవరైనా ఇంట్రనాసల్‌ వ్యాక్సిన్‌ డోసును తీసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement