Friday, November 22, 2024

ఇంటింటా ‘జ్వర’ సర్వే

కొత్తగూడ, ప్రభ న్యూస్ : అటు వాతావరణంలో మార్పులు….. ఇటు కరోనా వ్యాప్తి కారణంగా చాలామందిలో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు బయటపడుతున్నాయి. కోవిడ్ వ్యాప్తి తీరు, కట్టడి చర్యలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్తగూడ మండలం వ్యాప్తంగా ఒమైక్రాన్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకే క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్యం, పరిస్థితులను నేరుగా పరిశీలించి తగిన చర్యలు చేపట్టడం లక్ష్యంగా ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని కొత్తగూడ మండలంలోని కోనాపురం గ్రామంలో శుక్రవారం నుంచి రెవెన్యూ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి ఆరోగ్య సిబ్బంది వెళ్లి జ్వర సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తహసిల్దార్ చందా నరేష్, ఎంపీడీవో కరణ్ సింగ్ లు ప్రత్యక్షంగా ఇంటింటికి తిరుగుతూ సర్వేను పరిశీలిస్తున్నారు. ప్రజలందరూ సర్వేకు సహకరించాలని, జ్వరం, కరోనా లక్షణాలున్న వారికి అక్కడికక్కడే హోం ఐసోలేషన్‌ కిట్లు ఇస్తారని తెలిపారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ చేస్తామని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకట్, ఆశా కార్యకర్త శ్రీకళ, అంగన్వాడి టీచర్ శోభ,నిహారిక, ఏఎన్ఎంలు,గ్రామ పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement