Friday, November 22, 2024

డీడీ చానల్‌లో టెన్త్‌ విద్యార్థులతో ముఖాముఖి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈనెల 23వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల సన్నద్ధతపై ముఖాముఖి ప్రోగ్రామ్‌ను పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు దూరదర్శన్‌ ఛానల్‌ ద్వారా పదో తరతగతి విద్యార్థులు పరీక్షలకు ఎలా సిద్ధం కావాలనే దానిపై ఇంటరాక్షన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

లాస్ట్‌ అరగంటలో బిట్‌పేపర్‌…

ఇదిలా ఉంటే పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేపడుతున్నారు. 3గంటల 15 నిమిషాలు పరీక్ష సమయం కాగా, పరీక్షలకు చివరి అరగంటలో విద్యార్థులకు ఆయా సబ్జెక్టు సంబంధించిన బిట్‌ పేపర్‌ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక జనరల్‌ సైన్స్‌ పరీక్ష విషయానికొస్తే విద్యార్థులు రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఉదయం 9.30 నుంచి 11.05 నిమిషాల వరకు ఫిజికల్‌ సైన్స్‌ పేపర్‌ను మొదట విద్యార్థులు రాస్తారు. 10.35కు ఫిజికల్‌ సైన్స్‌ బిట్‌పేపర్‌ ఇస్తారు. ఆ తర్వాత 5 నిమిషాల తర్వాత 11.10కు బయోలాజికల్‌ సైన్స్‌ పేపర్‌ను ఇస్తారు. 12.15 గంటలకు బయోసైన్స్‌ బిట్‌పేపర్‌ అందిస్తారు. సెకండ్‌ పేపర్‌ను విద్యార్థులు 11.10 నుంచి 12.45 వరకు రాయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement