Saturday, November 23, 2024

నా జీవితమంతా సినిమానే…డైరెక్టర్ విజయ్ కిరణ్

ఇకముందు నేను చేయబోయే చిత్రాలు కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి” అని దర్శకుడు విజయ్ కిరణ్ తిరుమల తెలిపారు. ఆయన దర్శక, నిర్మాతగా అందించిన ‘పైసా పరమాత్మ’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకువచ్చి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. “పైసా పరమాత్మ’ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. వారికి థాంక్స్. అలాగే మా అమ్మా, నాన్న, గురువుగారు.. వీరివల్లే నేను ఇంత మంచి సినిమా తీయగలిగాను. ‘పైసా పరమాత్మ’దర్శకునిగా నాకు మంచి పేరు తెచ్చింది. నేను ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నానో దాన్ని పర్ఫెక్ట్ గా తెరపై చూపించగలిగా.

పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, కృష్ణవంశీ లాంటి వాళ్ళు మార్క్ క్రియేట్ చేసుకున్నారు. నాకంటూ ఓ స్టయిల్ తో ఈ సినిమా తీశాను. టైటిల్ కి ఎంతపేరు వచ్చిందో సినిమాకు కూడా అంతే స్పందన వచ్చింది.
భవిష్యత్తులో మాసంస్థల్లో కొత్త కంటెంట్ ఉన్న అన్ని
జోనర్ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్న. నా జీవితం అంతా సినిమానే. సినిమా అంటే నాకు విపరీతమైన ఇష్టం. మంచి స్టార్ కా’ బ్లాక్ బస్టర్స్ తీయాలని ఉంది. త్వరలోనే ‘డియమ్ కే’ టైటిల్ తో ఓ పోలీస్ సినిమా చేయబోతున్నాను” అని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement