బీజింగ్ – ఇంటర్నెట్ బానిసలుగా మారిపోతుండటంతో చైనా కొత్త రూల్స్ తీసుకువస్తోంది తాజాగా కొత్త నిబంధనలు రూపొందించి ఇంటర్నెట్ వాడకాన్ని నియత్రించింది.
చైనా చిన్నారులకు స్మార్ట్‌ఫోను వాడకంపై మరిన్ని సరికొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. మైనర్లు స్మార్ట్‌ఫోను ఉపయోగించే సమయాన్ని రోజుకు గరిష్ఠంగా రెండు గంటలకు పరిమితం చేస్తూ జిన్‌పింగ్ సర్కారు ఆంక్షలను తీసుకొస్తోంది.
చైనా అంతర్జాల నియంత్రణ సంస్థ అయిన ‘సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా’ (సీఏసీ) ఇందుకు సంబంధించిన నిబంధనల ముసాయిదాను బుధవారం విడుదల చేసింది.ఈ ముసాయిదా ప్రకారం.. మైనర్లకు రాత్రి 10.00 నుంచి ఉదయం 6.00 గంటల మధ్య ఇంటర్నెట్‌లోని చాలా సేవలు మొబైల్ ద్వారా అందుబాటులో ఉండవు.
16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్నవారు రోజుకు రెండు గంటలు మాత్రమే ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. 8 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఈ సమయం గంటకే పరిమితం. ఎనిమిదేళ్లలోపు వారికైతే 40 నిమిషాలు మాత్రమే అంతర్జాలం వాడుకునే అనుమతిl ఉంటుంది.