Tuesday, November 19, 2024

International: కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతి మహిళ.. ఎవరో తెలుసా!

భారత సంతతికి చెందిన కెనడియన్‌ రాజకీయ వేత్త అనితా ఆనంద్‌కు కీలక పదవి లభించింది. జస్టిన్‌ ట్రూడో కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణలో ఆమె రక్షణ మంత్రి గా నియమితులయ్యారు. ట్రూడోకు చెందిన లిబరల్‌ పార్టీ ముందస్తు ఎన్నికల్లో సైనిక సంస్కరణలకు పిలుపునిచ్చిం ది. ఈ క్రమంలో 54 ఏళ్ల అనితా ఆనంద్‌ రక్షణ బాధ్యతలు చేపట్టనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

భారత సంతతికి చెందిన హర్జిత్‌ సజ్జన్‌ స్థానంలో ఆమె నియమితులయ్యారు. సజ్జన్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ మంత్రిగా నియమితులైనట్లు సమాచారం. కొత్త కేబినెట్‌లో లింగ సమతుల్యం కనిపించింది. ప్రస్తుతం కేబినెట్‌లో 38 మంది ఉన్నారు. కెనడియన్‌ సైన్యం తన సంస్కృతిని మార్చుకోవడానికి, లైంగిక దుష్ప్ర వర్తన ఆరోపణలు నిరోధించడానికి మెరుగైన వ్యవస్థలను రూపొందించడానికి తీవ్రమైన ప్రజా, రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నది.

ఆనంద్‌కు కార్పొరేట్‌ లాయర్‌గా సుదీర్ఘ అనుభవం ఉంది. ఆమె కార్పొరేట్‌ గవర్నెన్స్‌పై విస్తృతంగా పనిచేశారు. ఈమె 46శాతం ఓట్లతో ఓక్‌విల్లే నుంచి ఎన్నికయ్యారు. ఇంతకు ముందు ఆమె దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement