Sunday, November 24, 2024

పుతిన్‌కు జూడో కిక్‌!

మార్షల్‌ ఆర్ట్స్ లో దిట్ట అయిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు గట్టిదెబ్బే తగిలింది. పదకొండేళ్ల వయసులోనే, జూడో, కరాటే వంటి యుద్ధవిద్యల్లో పట్టు సంపాందించిన పుతిన్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం ఉన్నాయి. అయితే, ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో ఆయన ప్రతిష్ట మసకబారుతోంది. ఇన్నాళ్లూ అంతర్జాతీయ జూడో ఫెడరేషన్‌ గౌరవాధ్యక్షుడిగా ఆయన వ్యవహరించారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనను ఆ పదవినుంచి తొలగిస్తూ అంతర్జాతీయ జూడో ఫెడరేషన్‌ నిర్ణయం తీసుకుంది.

2008 నుంచి పుతిన్‌ గౌరవాధ్యక్షుడిగా వ్యవహరిస్తూండగా ఇప్పుడు తొలగించారు. పైగా అంతర్జాతీయ జూడో ఫెడరేషన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ వ్యవహరించిన పుతిన్‌ను ఇప్పుడు ఆ గుర్తింపునూ రద్దు చేశారు. ప్రఖ్యాత యుద్ధక్రీడ జుడోకోలో 2014లో అత్యున్నతమైన ఎనిమిదవ గ్రేడ్‌ను సాధించిన పుతిన్‌ను జూడో క్రీడకు సరైన అంబాసిడర్‌ పుతిన్‌ అంటూ అప్పట్లో ఐజేఎఫ్‌ అధ్యక్షుడు మారియస్‌ విజెర్‌ ప్రకటించారు. అదే మారియస్‌ ఇప్పుడు పుతిన్‌ను ఆ పదవులనుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించడం విశేషం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement