Friday, September 20, 2024

International – హ‌మాస్ చీఫ్ ఇస్మాయిల్ హ‌నియే హ‌త్య‌…

టెహ్రాన్: పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు. ఇస్మాయిల్‌తో పాటు అతడి బాడీగార్డు ఒకరు చనిపోయారని హమాస్ అధికారికంగా ప్రకటించింది. బుధవారం తెల్లవారుఝామున టెహ్రాన్‌లోని ఇస్మాయిల్ నివాసంపై జియోనిస్టులు జరిపిన దాడిలో ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యారని హమాస్ నిర్ధారించింది. పాలస్తీనాలో యూదుల హక్కులు, ప్రత్యేక రాజ్యం కోసం పోరాడుతున్న జియోనిస్టులు జరిపిన ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని హమాస్ తెలిపింది.

కాగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఇస్మాయిల్ హనియే ఇరాన్ రాజధానికి టెహ్రాన్ వెళ్లారు. సోదరుడు, నాయకుడు, ఉద్యమ అధినేత ఇస్మాయిల్ హనియే ఇరాన్ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారని, అనంతరం టెహ్రాన్‌లోని తన ప్రధాన కార్యాలయంలో ఉండగా జియోనిస్టులు చేసిన దాడిలో ఆయన మరణించారని పేర్కొంది.

ఇజ్రాయేల్ లో హ‌మాస్ న‌ర‌మేథం..

గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లో హమాస్ నరమేధం సృష్టించింది. ఏకంగా 1,195 మంది అమాయక పౌరులను హత మార్చారు. దీంతో ఇస్మాయిల్ హనియేను అంతమొందించి హమాస్ గ్రూపును సమూలంగా తుడిచి పెడతామంటూ ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. ఇజ్రాయెల్‌పై దాడులకు ప్రతీకారంగా గాజాలో ప్రతీకార సైనిక చర్యలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇస్మాయిల్ లో హ‌త్య‌లో ఇజ్రాయేల్ హ‌స్తం ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు..

ఇస్మాయిల్ నేప‌థ్యం

- Advertisement -

1962లో గాజాకు సమీపంలో ఓ శరణార్థి శిబిరంలో ఇస్మాయిల్ జన్మించాడు. 1980 చివరలో హమాస్‌లో చేరాడు. 1990లో ఇస్మాయిల్ హనియా పేరు ప్రపంచానికి తెలిసింది. హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్‌కు సన్నిహితంగా మెలిగేవాడు. రాజకీయంగా సలహాలు ఇచ్చేవారు. అలా హమాస్‌లో క్రమంగా ఎదిగారు. 2004లో ఇజ్రాయెల్ చేసిన దాడిలో అహ్మద్ యాసిన్ చనిపోయారు. తర్వాత హమాస్‌లో ఇస్మాయిల్ కీలక వ్యక్తిగా మారారు.

హమాస్ చీఫ్‌గా..
2006లో పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎంపికయ్యారు. గాజా పట్టిని కొద్దిరోజులు పాలించారు. 2007 జూన్‌లో పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ అతన్ని పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి గాజాలో యుద్ధం మొదలైంది. అబ్బాస్ ఆదేశాలను సైతం ఇస్మాయిల్ ధిక్కరించాడు. పాలస్తీనా స్టేట్ ప్రధానిగా కొనసాగాడు. 2017లో హమాస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఇస్మాయిల్‌ను అమెరికా ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 2019లో ఇస్మాయిల్ గాజా పట్టిని వీడి, ఖతర్‌లో ఉంటున్నారు. ఈ ఏప్రిల్ నెలలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హనియా కుమారులు, మనవళ్లు, మనవరాళ్లు చనిపోయారని హమాస్ ప్రకటించింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో హనియా మృతిచెందాడు. అతని సెక్యూరిటీ గార్డ్ కూడా చనిపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement