హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ ముఠా దందాలు పెరిగిపోతు న్నాయి. పోలీసులు, నార్కొటిక్స్ సిబ్బంది ఎన్ని దాడులు చేసి ఎంతమందిని అరెస్ట్ చేసినప్పటికీ డ్రగ్స్ ముఠా మాత్రం వారి కార్యకలాపాలను యథేచ్చగా కొనసాగిస్తోంది. మరో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను రాచ కొండ పోలీసులు పట్టు-కున్నారు. మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ-, నాచారం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడు ల్లో ఇద్దరు విదేశీయులు సహా
నలుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి 500 గ్రాముల సూడోపెడ్రిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 80 గ్రాముల బంగారం, 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు- పోలీసులు వెల్లడించారు. తాజాగా పట్టుకున్న సిథటిక్ డ్రగ్‌ను సూడోపెడ్రిన్ డ్రగ్స్‌గా పేర్కొన్నారు. మొత్తం 500 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ బీఎస్ చౌహాన్ తెలిపారు. దాని విలువ 50 లక్షల ఉంటు-ందని అంచనా వేస్తున్నామన్నారు. ఇందులో మొత్తం ఇద్దరు విదేశీయులు సహా నలుగురిని అరెస్టు చేశామని చెప్పారు. వీరు మలేషియా, అస్టేలియా నుంచి డ్రగ్స్‌ను ప్రయాణికుల లగేజీలో పెట్టి తీసుకువస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. లగేజీ యాజమానులకు ఏమాత్రం తెలియకుండా జాగ్రత్తపడుతూ వారి వస్తువుల్లో డ్రగ్స్ పెట్టి స్మగ్లర్లు రవాణా చేస్తున్నారని వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలో 40 మంది ద్వారా విక్రయం
ముంబై కేంద్రంగా హైదరాబాద్‌కి డ్రగ్స్ స్లప చేస్తున్నారని సీపీ ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ దందా చేస్తున్న మూడు గ్యాంగ్‌లకు చెందిన వ్యక్తులను అరెస్టు చేశామని ఆయన చెప్పారు. మహారాష్ట్ర పోలీసుల సహకారంతో ఈ ఆపరేషన్లు చేశామన్నారు. సనా ఖాన్ అనే యువతి ద్వారా డ్రగ్స్ చైన్‌ను పట్టు-కున్నామని తెలిపారు. హైదరాబాద్‌కి చెందిన 40మంది, ముంబైలో 70 మంది స్నేహితులకు సనా ఖాన్ డ్రగ్స్ అమ్మకాలు చేస్తోందని అన్నారు. ఈమెకు సహకరిస్తున్న మరికొందరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరి వద్ద నుండి 204 గ్రాముల ఎండీఎంఏ, ఒక బైకును స్వాధీనం చేసుకున్నామని సీవీ ఆనంద్ వెల్లడించారు. ఏపీ నుండి ముంబైకి గంజాయి తరలిస్తుండగా మరో గ్యాంగ్‌ని పట్టు-కున్నామని ఆయన చెప్పారు. ఈ కేసులో భార్య, భర్తలు ఇద్దరూ పరారయ్యారని వారి కోసం గాలిస్తున్నట్లు- తెలిపారు. ఇక మూడో గ్యాంగ్‌ని కూడా పట్టు-కున్నట్లు- పేర్కొన్నారు. ఇక గత ఏడాదిగా హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ద్వారా 104 కేసులు నమోదు చేశామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు రూ.6.3కోట్లు- విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 202 డ్రగ్స్ ఫెడ్లర్లను అరెస్టు చేశామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
రెండు దేశాల పాస్‌పోర్టులతో నగరానికి వచ్చి…
గత నెల 7వ తేదీన ధూల్‌పేటలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ నైజీరియన్‌ను హయత్‌నగర్ ఎ-కై-్సజ్ అధికారులు అరెస్ట్ చేశారు. అతని వద్ద రూ.17.80లక్షల విలువైన 178 గ్రాముల కొ-కై-న్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ ప్రవీణ్ వెల్లడించారు. నిందితుడు 2015లో చదువు కోసం దేశానికి వచ్చాడని తెలిపారు. వీసా పరిమితి ముగిసినా.. అక్రమంగా భారత్‌లోనే ఉంటు-న్నాడని చెప్పారు. నిందితుడి వద్ద రెండు పాస్‌పోర్టులు ఉన్నట్టు- వెల్లడించారు. అసలు పాస్‌పోర్టు నైజీరియాకు చెందినది కాగా.. నకిలీ పాస్‌పోర్టు ఘనా దేశానికి చెందిందని వివరించారు. నిందితుడు మాదకద్రవ్యాలను బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చినట్టు- చెప్పారు. అతని వద్ద నుంచి రూ.17.80లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
అనుమానితుల సమాచారం ఇవ్వండి: ప్రజలకు విజ్ఞప్తి
నిందితుడిని విచారించగా.. సరైన సమాధానాలు చెప్పడం లేదని సీఐ ప్రవీణ్ తెలిపారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే తమకు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా విదేశీయులు ఎవరైన అనుమానస్పదంగా ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. మరోవైపు మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు చర్యలు చేపడుతునే ఉందన్నారు. అయినప్పటికీ కొందరు యువత, విద్యార్థులు వీటికి అలవాటి పడి వారి జీవితాలు చీకటిమయం చేసుకుంటు-న్నారని తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితిపై మార్పు తీసుకురావాలని పోలీసులు భావిస్తున్నారనీ, మత్తు పదార్థాల బారిన పడితే వాటి వల్ల కలిగే దుష్పలితాలపై అవగాన కల్పించాలని హైదరాబాద్ నగర పోలీసు విభాగం నిర్ణయించిందని చెప్పారు. మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ-ల్లో విద్యార్థులు, అధ్యాపకులు.. ప్రాథమికంగా కనీసం అయిదుగురు సభ్యులుగా బాధ్యతలు నిర్వహించాలని ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. పోలీసులు రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం యాంటీ- డ్రగ్ కమిటీ-లు.. డిజిటల్ ఫ్లాట్‌ఫాం, సెమినార్లు, సదస్సులు వంటివి నిర్వహిస్తూ డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించాల్సి ఉంటు-ంది.