కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్ …
మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్టు
ఎన్నికల ప్రచారం కోసం వెసులుబాటు
జూన్ రెండున కోర్టులో లొంగిపోవాలని షరతు
దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాలు మధ్యంతర బెయిల్ లభించింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిమిత్తం జూన్ 1 వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు
శుక్రవారం తీర్పు వెలువరించింది. మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజీవాలు ఈడీ అధికారులు అరెస్టు చేసింది.
అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది. వాటికి స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. అనంతరం బెయిల్ కోసం కేజ్రీవాల్ సుప్రీకోర్టులో పిటిషన్…. బెయిల్ పిటిషన్ పై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది.. అయినప్పటికీ కేజ్రీవాల్ ప్రచారంలో పాల్గొనేలా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు . జూన్ 5 వరకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది.