సమాజ్‌వాది పార్టీ నాయకుడు ఆజంఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు సుప్రీంకోర్టు గురువారం ప్రకటించింది. మోసం కేసులో అయన అరెస్టు అయ్యారు. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ వచ్చేవరకు ఈ మధ్యంతర బెయిల్ కొనసాగుతుందని సుప్రీంకోర్టు తెలియజేసింది. ఆర్టికల్ 142 అధికారాన్ని ఉపయోగించుకొని కోర్టు ఈ బెయిల్ మంజూరు చేసింది.
కొన్నిసార్లు చట్టాల ద్వారా న్యాయ పరిహారం అందకపోవచ్చు. అలాంటి సందర్భాలలో పూర్తి న్యాయం చేయడానికి ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు అసాధారణ అధికారాలు ఉంటాయి. 78 కేసులు ఆజంఖాన్‌పై నమోదు కాగా, 77 కేసుల్లో క్లీన్‌చీట్ వచ్చింది. చివరి కేసులో తీర్పు చాలా కాలంగారిజర్వులో ఉంది. ఈ కేసులో ఇంకా తుది తీర్పు వెలువడకపోయినప్పటికీ.. మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఆయన తొందరలోనే విడుదల కాబచ్చునని అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..