Friday, November 22, 2024

TS | రసవత్తంగా హెచ్‌సీఏ ఎన్నికలు.. బరిలోకి నాలుగు ప్యానల్‌లు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 20న (శుక్రవారం) హెచ్‌సీఏ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ఆరు పోస్టుల కోసం పోటీలు జరగనున్నాయి. అధ్యక్షుడు, ఉప అధ్యక్షుడు, సెక్రటరీ, జాయింట్‌ సెక్రటరీ, ట్రెజరర్‌, కౌన్సీలర్‌ల స్థానాల కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వర్‌ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయి. మొత్తం నాలుగు ప్యానల్‌లు ఈ పోటీలకు రెడీ అయ్యాయి.

గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. అధికారిక భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) పార్టీ అండదండలతో జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం (హెచ్‌ఏఐ) ప్రధాన కార్యదర్శి అర్శినపల్లి జగన్‌మోహన్‌ రావుకు చెందిన.. యునైటెడ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ హెచ్‌సీఏ.. ప్యానల్‌ ఈసారి మిగతా వారితో పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు మాజీ క్రికెటర్లు శివలాల్‌ యాదవ్‌, అర్షద్‌ అయూబ్‌లు సంయుక్తంగా తమ ప్యానల్‌ను బరిలోకి దించుతున్నారు.

క్రికెట్‌ ఫస్ట్‌ అనే పేరుతో వీరు నామినెషన్‌ వేశారు. వీరికి ఇప్పటికే హెచ్‌సీఏలో కీలక పదవులు చేపట్టిన అనుభవం ఉంది. కానీ హైదరాబాద్‌ క్రికెట్‌ అభివృద్ధి కోసం పెద్దగా చేసిన పనులుఏమిలేవని ప్రత్యర్థులు వీరిపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు భారతీయ జనతపార్టీ (బిజెపి)కి చెందిన కీలక నేత హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్‌ వెంకటస్వామి కూడా తన ప్యానల్‌ను బరిలోకి దింపాడు. దీంతో ఎన్నికలు మరింతా రసవత్తరంగా మారాయి.

- Advertisement -

దీంతో ఇప్పుడు బిఆర్‌ఎస్‌, బిజెపి పార్టీల మధ్య తీవ్ర పోటీ ఎదురవడం ఖాయమనిపిస్తోంది. అనిల్‌ కుమార్‌ ప్యానల్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అనే పోరుతో బరిలోకి దిగుతోంది. అనిల్‌ కుమార్‌ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు. కాగా, ఈ పోటీల్లో జగన్‌మోహన్‌ రావు పటిష్టంగా కనిపిస్తున్నారు. ఈయనకు అధికారిక పార్టీ కీలక నేతలు అండదండలు ఉన్నాయి. వారే జగన్‌మోహన్‌ను బరిలోకి దించుతున్నారని తెలిసింది. అలాగే 100 క్లబ్‌ సెక్రటరీలలో అధిక శాతం మంది జగన్‌మోహన్‌ ప్యానలతో టచ్‌లో ఉన్నాయని సమాచారం.

173 మంది ఓటర్లు..

శుక్రవారం జరుగనున్న ఎన్నికల్లో మొత్తం 173 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాధారణ మెజారిటీ సాధించేందుకు 87 ఓట్లు అవసరం. హెచ్‌సీఏ ఓటర్ల జాబితాలో 48 ఇన్‌స్టిట్యూషన్స్‌, 6 జిల్లాల అసోసియేషన్లు, 15 మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. ప్రభుత్వం సూచనల మేరకు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవటం ఇన్‌స్టిట్యూషన్స్‌కు సంప్రదాయంగా వస్తోంది. జిల్లా క్రికెట్‌ సంఘాలు సైతం అదే కోవలో ఉన్నాయి.

నాలుగు ప్యానల్‌ల నుంచి పోటీ పడుతున్న వారు..

అధ్యక్షుడుఉప అధ్యక్షుడు సెక్రెటరీ జాయింట్‌ సెక్రెటరీ ట్రెజరర్‌కౌన్సీలర్‌
ఏ. జగన్‌ మోహన్‌ రావుసీ. బాబురావుఆర్‌. దేవరాజ్‌చిట్టి శ్రీధర్‌
సీజె శ్రీనివాస రావు
డీఏజె వాల్టర్‌
అమర్‌నాథ్‌గుండల శ్రీనివాస రావుఆర్‌. హరినారాయణ రావునోయెల్‌ డేవిడ్‌సీ సంజీవ్‌ రెడ్డిడా. అనస్‌ అహ్మద్‌ ఖాన్‌
డా. కె. అనిల్‌ కుమార్‌పి. శ్రీధర్‌ఆర్‌ఎమ్‌ భాస్కర్‌సతీష్‌ చంద్ర శ్రీనివాస్తవాగెరాడ్‌ కార్‌సునీల్‌ కుమార్‌
పీఎల్‌. శ్రీనివాస్‌సర్దార్‌ దల్జిత్‌ సింగ్‌వీ.ఆగమ్‌ రావుటీ బస్వ రాజుమహేంద్ర పీవినోద్‌ కుమార్‌ ఇంగ్లే.

Advertisement

తాజా వార్తలు

Advertisement