Tuesday, November 26, 2024

నెలాఖరులో ఇంటర్ సంప్లిమెంటరీ ఫలితాలు.. 13 నుంచి మూల్యాంకనం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం నుంచి ప్రారంభమైన పరీక్షలు ఈనెల 10 వరకు జరగనున్నాయి. అయితే జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఈనెల 13వ తేదీ నుంచి చేపట్టను న్నారు. మొత్తం మూడు విడతల్లో మూల్యాంకనం చేయనున్నారు. మొదటి స్పెల్‌ మూల్యాంకనం ఈనెల 13న, 16న రెండవ స్పెల్‌, 18న మూడో స్పెల్‌ మూల్యాం కనం చేయనున్నారు.

ఆతర్వాత పేపర్లను అప్‌లోడింగ్‌ తదితర స్క్రూటినీ పక్రియను పూర్తి చేసి ఈనెల చివరి వారంలో ఫలితా లను వెల్లడించే అవకాశం ఉన్నట్లు విద్యావర్గాల ద్వారా తెలు స్తోంది. ఇదిలా ఉంటే సోమవారం జరిగిన ఇంటర్మీ డియట్‌ సప్లమెం టరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగి నట్లు బోర్డు అధికారులు తెలి పారు. ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులు 71,057 మంది హాజరు కాగా, సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు 32, 090 మంది హాజ రైనట్లు పేర్కొ న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement