ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ 19ఏళ్ల యువతి గదిలో సూసైడ్ చేసుకున్న ఘటన గోవాలో చోటుచేసుకుంది. సౌత్ గోవాలోని కర్చోరేమ్ కకోరా ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఆ యువతి క్యూపెం గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ కామర్స్ చదువుతోంది. ఎవరూ లేని టైమ్‌లో ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుందని, మృతురాలి పేరు కవితాదేవిగా పోలీసులు గుర్తించారు.
ఖానాపూర్ గ్రామానికి చెందిన కవితా ఫ్యామిలీ సౌత్ గోవా పరిధిలోని కర్చోరెమ్ కకోరా ఏరియాలో ఓ గదిలో రెంట్‌కు ఉంటోంది. కాగా, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కర్చోరేమ్ పోలీసులు తెలిపారు.