Sunday, November 24, 2024

మూడు రోజుల్లో ఇంట‌ర్ ఫలితాలు!

ఇంటర్‌ ఫలితాలను మూడు నాలుగు రోజుల్లో వెల్లడించనున్నట్లు తెలంగాణ‌ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. అయితే 2019లో జరిగిన తప్పిదాలు, పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ఒకటికి రెండు సార్లు ఫలితాలను క్రాస్‌ చేక్‌చేసుకుంటున్నారు. విద్యార్థుల మార్కులను రీకౌంటింగ్‌ చేస్తున్నారు. ఈ కారణంగా ఫలితాల ప్రకటనలో కాస్త ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. 2019లో ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన తప్పిదాల కారణంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఫలితాల్లో 29 పొరపాట్లు దొర్లినట్లు అప్పట్లో అధికారులు గుర్తించారు. గతేడాది కూడా ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో 49 శాతం మంది మాత్రమే విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

ఈ క్రమంలో మిగతా విద్యార్థులను పాస్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో ఈ సారి ఫలితాలు ఆలస్యమైనాగానీ… ఒకటికి రెండు సార్లు ఒక్కో ప్రశ్నకు వేసిన మార్కులు, మొత్తం మార్కులు ఎన్ని వచ్చాయో లాంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాంతో ఫలితాలను రీస్కాన్‌ చేస్తున్నట్లు తెలిసింది. మూడు నాలుగు రోజుల్లోనే ఫలితాలు ఉంటాయని బోర్డులోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇంటర్‌ ఫలితాల తర్వాత జవాబు పత్రాలను విద్యార్థుల సౌకర్యం కోసం ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement