హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇంటర్ ప్రాక్టికల్స్ సిలబస్‌ను తగ్గించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్‌కు 70 శాతం సిలబస్‌తో నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సెకండ్ ఇయర్‌కు మాత్రం 100 శాతం సిలబస్‌తో ప్రాక్టికల్స్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. మే/జూన్‌లో అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. వార్షిక పరీక్షలను వంద శాతం సిలబస్‌తో నిర్వహించనున్న విషయం తెలిసిందే.