హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం మరోసారి గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. ఈమేరకు ఉత్తర్వులను జారీచేసింది. ఈనెల 31వ తేదీ వరకు అడ్మిషన్ల గడువును పొడిగిస్తున్నట్లు అందులో తెలిపింది. ఆ గడువు ముగిసిన తర్వాత.. ఆగస్టు 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అడ్మిషన్లు పొందాలనుకునే వారి నుంచి రూ.500 లేట్ ఫీజు వసూలు చేయాలని తెలిపింది. ఈ నిర్ణయంపై పలు అధ్యాపక సంఘాల నేతలు మండిపడుతున్నారు.
విద్యార్థుల నుంచి రూ.500 వసూలు చేయడమనేది చాలా దారుణమని ఆరోపిస్తున్నారు. ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీల లిస్టును వెబ్‌సైట్‌లో పొందుపర్చనినట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఏ కాలేజీకి గుర్తింపు ఉందో లేదో చూసుకొని తమ పిల్లలను ఇంటర్ బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.