కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేపు ఇంటర్ బోర్డు ముందు రెండు గంటలు దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు ఉదయం 11గంటల నుండి ఒంటిగంట వరకు దీక్ష చేస్తానని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో 51శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దాంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతిపక్షాలు ఏకమై ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేకూరేలా ప్రభుత్వంపై ఒత్తడిని తెస్తున్నారు. ఇంటర్ విద్యార్థులు ఇబ్బందులు సీఎం కేసీఆర్‌కి నచ్ఛ చెప్పడంలో సబితా ఇంద్రారెడ్డి ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు. ఇంటర్ విద్యార్థులకు కనీస మార్కులు వేసి పాస్ చేయాలని డిమాండ్ చేశారు . విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న తర్వాత స్పందిస్తారా అని మండిపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..